Year End 2023: ఈ ఏడాది విడుదలైన రీమేక్ చిత్రాలివే.. ఒక్కటి కూడా హిట్టు కాలేదుగా!

మరో 20 రోజుల్లో 2023 సంవత్సరానికి ముగింపు పలకబోతున్నాం. అలాగే మరో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించబోతున్నాం. ఈ ఏడాది చేసిన తప్పులు మళ్ల చేయకుండా జీవితంలో ఎదిగేలా అంతా ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఈ ఏడాది సినిమాలు చేసిన ఫ్లాపులు వచ్చిన వాళ్లంతా కసితో హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే ఈ ఏడాది ఎవరికి కలిసొచ్చింది, ఏయే సినిమాలకు మైనస్ గా మారిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఏడాది వచ్చిన రీమేక్ చిత్రాలు ఏవి హిట్లుగా నిలిచాయా ఫ్లాపులుగా మారాయా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2023 సంవత్సరంలో వచ్చిన భోళా శంకర్ సినిమా మెగాస్టార్ చిరంజీవికి గట్టి దెబ్బనే కొట్టింది. ముఖ్యంగా దర్శక, నిర్మాతలకు ఫుల్ నష్టాలను తెచ్చి పెట్టింది. అయితే ఈ భోళా శంకర్ సినిమా రీమేక్ చిత్రం. అజిత్ వేదాళం సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కించి నష్టాల పాలయ్యారు. ఈ ఒక్క చిత్రమే కాకుండా గాడ్ ఫాదర్ కూడా మెగాస్టార్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోయిన చిరు రెండు సినిమాలు ఫ్లాపులుగా నిలవడంతో ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారు. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

2023 Tollywood Remake Movies List Check Details

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన బ్రో సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా... ఎవరూ ఊహించని స్థాయిలో సినిమాలో బెడిసి కొట్టింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో పవన్ కనిపించగా.. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా కనిపించాడు. నటనపరంగా బాగనే ఉన్నప్పటికీ... వీనోద సీతం సినిమాను సబ్ టైటిల్స్ పెట్టుకుని ఎక్కువ మంది చూడడం వల్లే ఈ సినిమా అంతగా ఆడలేదనే టాక్ కూడా వచ్చింది.

అయితే బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు పర్వాదేలనిపించినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం హిట్టు కొట్టలేకపోయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా.. సుదీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రావణాసుర చిత్రం కూడా ఫ్లాప్ అయింది. బెంగాళీ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం.. ఏప్రిల్ 7వ తేదీన గ్రాండ్ గా విడుదల అయింది. కానీ డిజాస్టర్ గా నిలిచి రవితేజకు కోలుకోలేని దెబ్బకొట్టింది.

2023 Tollywood Remake Movies List Check Details

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమా.. మరాఠీలో ఎన్నో అవార్డులు అందుకున్న నట సామ్రాట్ ఆధారంగా తెరకెక్కిన సినిమాకు రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రంగస్థల నటుడు, నటన నుండి రిటైర్ అయ్యాక ఆస్తులన్నీ కొడుకు, కూతుర్లకు పంచి ఇచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో రంగమార్తాండ తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానంద నటనకు మంచి మార్కులే పడ్డాయి. మిగతా వారు కూడా పరిధి మేర చక్కగా నటించారని విశ్లేషకులు వివరించారు. నటన, కథ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు అయినప్పటికీ.. సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

2023 Tollywood Remake Movies List Check Details

అలాగే సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా జనవరి 26వ తేదీన విడుదల అయింది. సుధీర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో సుధీర్ బాబు డిఫరెంట్ రోల్ చేశారు. స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన అలాంటి రోల్ చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇంత కష్టపడి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముంబై పోలీస్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X