ఆ విషయంలో సమంత కంటే తమన్నాకే క్రేజ్ ఎక్కువ.. మీకు కూడా అలాగే అనిపిస్తోందా?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ ప్రజల అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించే ఈ ఆర్మాక్స్ సంస్ఖ తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి మోస్ట్ పాపులర్ ఓటీటీ నటుల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 నటుల పేర్లను ఎక్స్ వేధికగా వెల్లడించింది. అయితే అందులో టాప్ వన్ స్థానంలో మనోజ్ బాజ్ పేయి ఉండగా.. టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. స్టార్ హీరోయిన్ సమంతను నెట్టుకుని ముందుకు వచ్చింది. అయితే వీరితో పాటు టాప్ 10లో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హీరోలు అయినా హీరోయిన్లు అయినా సరే వారు ఓటీటీల్లో కనిపించడం ఎక్కువ అయినప్పుడు పై స్థానాలకు రావడం.. లేదంటే కింది స్థానాలకు పడిపోవడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఓటీటీలో సందడి చేసిన నటుల పేర్లను చెప్పి సర్వే చేయగా... చాలా మంది అభిమానులు ఓట్లు వేశారు. అలా పూర్తిగా అభిమానులపై ఓట్లపై మాత్రమే ఆధారపడి చేసిన ఈ సర్వే లిస్టును టాప్ వన్ స్థానంలో మనోజ్ బాజ్ పేయి ఉన్నాడు. అయితే కిల్లర్ సూప్ అనే వెబ్ సిరీస్ తో ఈయన సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

2024 Most Popular OTT Acors in India List is Here Check Details

ఇక రెండో స్థానంలో పంకజ్ త్రిపాఠి నిలిచారు. ఆ తర్వాత స్థానంలో అంటే టాప్ 3లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ నిలిచారు. ఆ తర్వాత అంటే టాప్ 5 లిస్టులో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఉన్నారు. ఇక 6వ స్థానంలో జితేంద్ర కుమార్ నిలిచారు. టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఏడో స్థానానికి చేరిపోయింది. ఇక ఎనిమిదవ స్థానంలో విజయ్ సేతుపతి, తొమ్మిదవ స్థానంలో స్టార్ హీరోయిన్ సమంత, పదో స్థానంలో రాజ్ కుమార్ రావు నిలిచారు.

2024 Most Popular OTT Acors in India List is Here Check Details

అయితే టాప్ 10లో మొత్తం ముగ్గురే హీరోయిన్లు ఉండగా.. వారిలో ఒకరు బాలీవుడ్ బ్యూటీ. మిగతా వాళ్లు ఇద్దరూ టాలీవుడ్ హీరోయిన్లు. అయితే ఇందులో టాప్ లో తమన్నా భాటియా ఉండగా.. సమంత మాత్రం చివరకు వచ్చేసింది. సమంతను దాటుకుని మరీ తమన్నా ముందుకు వెళ్లడం చూసిన చాలా మంది ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆరోగ్యం బాగాలేక సమంత కాస్త సినిమాలకు గ్యాప్ ఇవ్వగా.. తమన్నా మాత్రం తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇలా టాప్ లో నిలిచి అందరినీ అలరిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X