Just In
- 2 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 27 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 32 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 39 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'22'కి నాగార్జున సపోర్ట్.. సినిమాపై ఆసక్తి రేపుతున్న టీజర్
ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా బాగా పెరిగింది. క్రైమ్, రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను తమదైన యాంగిల్‌లో రూపొందించి భేష్ అనిపించుకుంటున్నారు నయా దర్శకనిర్మాతలు. పైగా ఈ చిన్న సినిమాలకు పెద్ద హీరోలు కూడా సహకారం అందిస్తూ ప్రమోషన్స్ చేయడం తెలుగు చిత్రసీమలో శుభపరిణామం.
ఈ మేరకు తాజాగా కింగ్ నాగార్జున '22' అనే సినిమాకు తన సపోర్ట్ పలికారు. తన చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి లాంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో అణిచేసిన శివకుమార్ దర్శకత్వంలో ఈ 22 మూవీ రూపొందుతోంది.

ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇన్వెస్టిగేషన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా '22' ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక తాజాగా విడుదలైన ఈ 22 టీజర్ ఆసక్తికరంగా ఉంది. కొంత మంది యువతీ యువకులు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. ఆ హత్యల వెనుక ఉన్న కారణమేంటి? అనే విషయాన్ని పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయడం ఈ సినిమా నేపథ్యం. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.