24 కిస్సెస్: హెబ్బా పటేల్ ముద్దు సీన్ల విందు ఈ వారం లేనట్లే!
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ '24 కిస్సెస్'. మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ వారం (అక్టోబర్ 26) విడుదలవ్వాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో సినిమా విడుదలను వాయిదా వేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 15న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అనుకోని కారణాలతో సినిమా వాయిదా పడటంతో ఈ వారం హెబ్బ పటేల్ ముద్దు సీన్ల విందు చూసే అవకాశం లేకుండా పోయింది.

ముద్దు సీన్ల విషయంలో టాలీవుడ్లో ట్రెండ్ మారుతోంది. కథకు అవసరం అంటూ చాలా ముద్దు సీన్లు జొప్పిస్తున్నారు. చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించడానికి ఇలాంటి బాగా ఉపయోగపడతాయనేది కొందరి వాదన. అక్కడి వరకు వచ్చిన ప్రేక్షకుడికి సినిమా నచ్చితే సూపర్ హిట్టే. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాల విషయంలో ఇలాంటి మ్యాజిక్కే వర్కౌట్ అయింది.
సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్: అయోద్యకుమార్ కృష్ణం శెట్టి, నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, కెమెరామెన్: ఉదయ్ గుర్రాల, మ్యూజిక్: జాయ్ బరువ, ఎడిటర్: ఆలయం అనిల్, రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ.


Click it and Unblock the Notifications











