24 కిస్సెస్.. హెబ్బా పటేల్ సినిమాకు లైన్ క్లియర్
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ '24 కిస్సెస్'. మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
ఈచిత్రాన్ని నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. అదే ఊపులో సినిమా విడుదల చేయాలని భావించినా థియేటర్ల సమస్య కారణంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్ కాక పోయినా... హెబ్బ పటేల్‌కు గ్లామరస్ బ్యూటీ అనే పేరుంది. ఈ అందాల సుందరి ఇపుడు ముద్దు సీన్లే ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓ వైపు ఇండస్ట్రీలో ముద్దు సీన్లు ఉంటే సినిమా హిట్ అనే ట్రెండ్ నడుస్తోంది. ఇందులో ఏకంగా 24 ముద్దు సీన్లు ఉంటాయని ఏకంగా టైటిల్ వేసి మరీ చెబుతున్నారు. మరి బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
సిల్లీమంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్: అయోద్యకుమార్ కృష్ణం శెట్టి, నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, కెమెరామెన్: ఉదయ్ గుర్రాల, మ్యూజిక్: జాయ్ బరువ, ఎడిటర్: ఆలయం అనిల్, రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ.


Click it and Unblock the Notifications











