25 years of Lagaan: లగాన్‌కు 25 ఏళ్లు.. ఆమీర్ ఖాన్‌ బాక్సాఫీస్ చరిత్ర, తృటిలో చేజారిన ఆస్కార్..

భారతీయ చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఎన్నో సినిమాలు వచ్చాచి. అయితే ఇలాంటి వాటికి ట్రెంట్ సెట్టర్‌గా నిలిచింది లగాన్. దేశభక్తి, క్రికెట్, గ్రామీణ వాతావరణం అంశాల చుట్టూ తిరిగిన ఈ సినిమా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది. దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ థియేటర్‌లో ప్రేక్షకులు కుర్చీకి అతుక్కుపోయారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ విడుదలై ... ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లగాన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు పరిశీలిస్తే..

లగాన్ తారాగణం
ఆమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమీర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాగా.. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించారు. లగాన్‌లో అమీర్ సరసన గ్రేసీ సింగ్ హీరోయిన్‌గా నటించారు. రేచల్ షెల్లే, పౌల్‌ బ్లాక్‌థోర్న్, సుహాసిని ములే, కుల్‌భూషణ్ కర్బందా, రాజేంద్ర గుప్తా, రఘుబీర్ యాదవ్, రాజేశ్ వివేక్, ప్రదీప్ రావత్, దయా శంకర్ పాండే తదితరులు లగాన్‌లో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. అనిల్ మెహతా సినిమాటోగ్రఫి, బాలు సలూజ ఎడిటర్‌గా వ్యవహరించారు. 2001 జూన్ 15న లగాన్ మూవీ రిలీజ్ అయ్యింది.

25 years of Lagaan Aamir Khan s Classic That Changed Indian Sports Cinema

ఆమీర్‌ను నిర్మాతగా మార్చి
బ్రిటీష్ పరిపాలనలో 1890ల నాటి ఓ గ్రామాన్ని సెట్ వేసి రూపొందించారు. ఈ సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ వరకు అనేక అడ్డంకులు ఎదురైనా వాటిని ఆమీర్‌ఖాన్ తట్టుకుని నిలబడ్డారు. తొలుత లగాన్ స్టోరీ షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్‌ల వద్దకు వెళ్లగా వారు తిరస్కరించడంతో ఆమీర్ వద్దకు చేరింది. అలాగే లగాన్‌ను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడంతో ఈ బాధ్యతను కూడా ఆమీర్ తన భుజాలపై వేసుకున్నారు. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి లగాన్‌ను నిర్మించారు. దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం కష్టమని అప్పట్లో కొందరు పెదవి విరిచారు. అయితే కథలో దమ్ము, ఆకట్టుకునే కథనం ఉంటే ప్రేక్షకులు నిడివి గురించి ఏమాత్రం పట్టించుకోరని లాగన్ .. భారతీయ వెండితెరకు మరోసారి చాటి చెప్పింది.

భుజ్ భూకంపంతో విధ్వంసం
లగాన్ షూటింగ్‌ను గుజరాత్‌లోని భుజ్‌లో చిత్రీకరించారు. ఈ సమయంలో అక్కడి ప్రజలు సినిమాలో భాగం కావడం, ప్రతిరోజూ వారితోనే గడపటంతో స్థానికులతో చిత్ర బృందానికి మంచి అనుబంధం ఏర్పడింది. అయితే 2001 జనవరి 26న భుజ్‌లో వచ్చిన భారీ భూకంపం ఆ ప్రాంతాన్ని నామరూపాల్లేకుండా మార్చి విధ్వంసం సృష్టించింది. ఈ సంఘటన చిత్ర యూనిట్‌నే కాదు భారతదేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

లగాన్ కలెక్షన్స్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి లగాన్‌కు 25 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా కథ, పాటలు, అమీర్ ఖాన్ నటన, దేశభక్తి సిన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. భారత్‌లో 34.31 కోట్ల రూపాయల నెట్.. 55.13 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది లగాన్. విదేశాల్లోనూ లగాన్‌కు వసూళ్ల వర్షం కురిసింది. యూకేలో 6 లక్షల పౌండ్లు, నార్త్ అమెరికాలో 9.10 లక్షల డాలర్లు, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ ఇతర దేశాలలో 1.80 లక్షల రూపాయలు చొప్పున ఓవర్సీస్‌లో 10.84 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండేళ్ల తర్వాత 16 మే, 2003న చైనాలో విడుదలైన లగాన్ మూవీ 3 మిలియన్ యువాన్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దాంతో మొత్తంగా 67.68 కోట్ల రూపాయలను లగాన్ వసూలు చేసినట్లయ్యింది. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే ఈ వసూళ్ల విలువ 372 కోట్ల రూపాయల పై మాటే.

ఆస్కార్ అలా మిస్
కలెక్షన్స్ పరంగానే కాదు.. విడుదలయ్యాక రికార్డులు, రివార్డుల పరంగానూ లగాన్ చిత్రం సంచలనం సృష్టించింది. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఏకంగా 8 పురస్కారాలను కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ నామినేషన్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. మదర్ ఇండియా, సలాం బాంబే తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ చిత్రంగా లగాన్ నిలిచింది. తుది వడపోతలో 5వ స్థానం వరకు వచ్చి తృటిలో ఆస్కార్‌ను మిస్ అయ్యింది. అలా భారతీయ చిత్ర పరిశ్రమలో క్లాసిక్ మూవీలలో ఒకటిగా లగాన్ ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ లగాన్ కథ, కథనం ఫ్రెష్‌గానే ఉంటూ జెన్ జీ జనరేషన్‌ను సైతం ఆకట్టుకుంటోంది.

Read more about: lagaan aamir khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X