మరో ప్రపంచాన్ని చూశా.. రజనికి దాసోహం కావడం ఖాయం!
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ శంకర్ 2.0 చిత్రానికి దాసోహమైపోయాడు. ఈ ఉదయమే చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు సినిమా చూసిన అంతరం తన స్పందన తెలియజేస్తూ మరో ట్వీట్ చేశాడు. 2.0 చిత్రాన్ని చూస్తున్నంత సేపు తాను మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగిందనితెలిపాడు .
2.0 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ సూపర్ స్టార్ రజనికి దాసోహం కావడం ఖాయం అని అనిరుధ్ పేర్కొన్నాడు. వేలాదిమంది పడ్డ కష్టానికి ఫలితమే 2.0. మళ్ళీ మళ్ళి చూడాలనిపించే విధంగా ఈ చిత్రం ఉంది. శంకర్ మాస్టర్ దర్శకుడు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. శంకర్, రజని, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తో ఎంతోమంది ఈ చిత్రం కోసం శ్రమించారు అంటూ అనిరుద్ ట్వీట్ చేశాడు.

600 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందించిన 2.0 చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. వరల్డ్ వైడ్ గా ఈచిత్రాన్ని 10 వేల స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శంకర్ త్రీడి ఫార్మాట్ లో రూపొందించారు.


Click it and Unblock the Notifications











