Comedian Prudhvi: ఫ్యామిలీగా దూరంగా ఆమెకు దగ్గరగా.. గొడవలు జరుగుతున్నాయి.. కానీ..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కొన్నేళ్ల ముందు వరకు కూడా సినిమా పరిశ్రమలో చాలా బిజీ గా కనిపించాడు. ఇక ఎప్పుడైతే అతను రాజకీయాల్లో చేరాడో ఇతర సినీ ప్రముఖులపై కూడా వివాదస్పదంగా వ్యాఖ్యలు చేసాడు. అప్పటినుంచి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా అతను కొన్ని గొడవలలో కూడా హాట్ టాపిక్ గా నిలిచాడు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పృథ్వి రాజ్ తన ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా ఒక వివరణ ఇచ్చాడు.

టాప్ కమెడియన్స్ లో ఒకడిగా..

టాప్ కమెడియన్స్ లో ఒకడిగా..

ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ మంచి నటనతో ఆకట్టుకున్న పృథ్వి ఆ తర్వాత చాలా సినిమాల్లో అదే తరహా డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు.. బ్రహ్మానందం సునీల్ వేణుమాధవ్ ఇలా కొంత మంది కమెడియన్స్ టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో ఆ తర్వాత పృథ్వి రాజ్ అదే తరహాలో తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చాడు.

రాజకోయల్లో చేరిన అనంతరం

రాజకోయల్లో చేరిన అనంతరం

నటుడిగా మంచి ఊపు మీద ఉన్న సమయంలో ఏడాదికి వంద సినిమాల వరకు చేసుకుంటూ వచ్చిన పృథ్విరాజ్ సడన్ గా ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజకీయాల్లో చేరడంతో ఒక్కసారిగా అతని జీవితం మారిపోయింది. రాజకీయాల్లో చేరిన తర్వాత కొంతమంది కారణంగా పవన్ కళ్యాణ్ అలాగే ఇతర సినీ ప్రముఖులు కూడా అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది తనను కావాలని అలా తిట్టించారు అని కూడా ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చాడు.

 8 ఏళ్లుగా ఫ్యామిలీకి దూరంగా

8 ఏళ్లుగా ఫ్యామిలీకి దూరంగా

దాదాపు 8 ఏళ్లుగా నేను నా కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు అంటే ప్రస్తుతం నా కుటుంబ సభ్యులు విజయవాడ లో ఉంటున్నారు నేను మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నాను. పిల్లలు అందరూ కూడా హ్యాపీగానే సెటిలయ్యారు వారికి నేను చాలా వరకు దూరంగానే ఉన్నాను.. మీ పృథ్వి రాజ్ తెలియజేశాడు.

 ఆమెకు దగ్గరగా..

ఆమెకు దగ్గరగా..

అయితే చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఆమెతో పరిచయం ఉంది. ఆమె వరంగల్ నుంచి ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. తన పేరు దాసరి పద్మరేఖ. ఆమెకు సహాయం చేసే గుణం ఎక్కువ. నాకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎంతో సహాయం గా ఉన్నారు. ఇక ప్రస్తుతం నేను ఆమెతోనే ఉంటున్నాను. 8 ఏళ్లుగా నా కుటుంబ సభ్యులకు దూరంగానే ఉన్నాను.. అని అన్నారు.

ఆమె నాతోనే ఉన్నారు

ఆమె నాతోనే ఉన్నారు

ఫ్యామిలీ కేసులు గొడవలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా నా భార్యతో అయితే నాకు విడాకులు కాలేదు. ప్రస్తుతం నేను వారితో కలవకుండా ప్రత్యేకంగానే ఉంటున్నాను. నేను ఎన్ని కష్టాల్లో ఉన్న కూడా నాతో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం దాసరి పద్మరేఖ గారే. నాకు ఏం కావాలన్నా కూడా చూసి పెడతారు.. అని పృథ్వీరాజ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X