Bro Dance Video మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్‌పై యాక్టర్ పృథ్వీ ఘాటుగా సెటైర్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో ది అవతార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా అన్ని వర్గాల నుంచి సానుకూలమైన స్పందనను సొంతం చేసుకొంటున్నది. అయితే ఈ సినిమాలో పబ్ సీన్‌లో యాక్టర్ 30 ఇయర్స్ ఇంఢస్ట్రీ పృథ్వీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన సన్నివేశంపై మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీన్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబును ట్రోల్ చేయడానికే పెట్టిందనే విషయం చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదాస్పద సన్నివేశంపై అంబటి, పృథ్వీ చేసిన కామెంట్ వివరాల్లోకి వెళితే..
బ్రో ది అవతార్ (Bro The Avatar) సినిమాలో ఓ పబ్ సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సీన్‌లో అమ్మాయిల పిచ్చి ఉన్న శ్యాంబాబు (30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ) అనే క్యారెక్టర్ నాన్ సింక్‌లో మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తుంటాడు. ఆ డ్యాన్స్‌పై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్లే అవుతున్న మ్యూజిక్ ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అంటూ సీరియస్ అవుతాడు.

అయితే బ్రో ది అవతార్ (Bro The Avatar) సినిమా పబ్ సీన్‌లో క్యారెక్టర్‌ను చూస్తే.. గతంలో సంక్రాంతి పండుగ సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఓ వేడుకలో డ్యాన్స్‌ను పోలినట్టు ఉండే విధంగా ఉండటం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ సీన్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
బ్రో సినిమాలో సన్నివేశంపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. మూవీలో నేను డ్యాన్స్ చేసినట్టు ఓ క్లిప్పింగ్ ఉందనే విషయం మీడియాలో వచ్చింది. టెలివిజన్‌లో కూడా చూశాను. నేను సినిమా చూడలేదు. నన్ను దూషించడం పవన్ కల్యాణ్‌కు అలవాటే. నాపై కోపంతో అలా చేసి ఉంటాడు. ఎవరిపైనా కోపం ఉంటే.. కొందరు వారి బొమ్మను కొట్టడం చేస్తుంటారు. పవన్ కల్యాణ్‌కు పిస్టల్ ఉంటే నా బొమ్మను కాల్చి సంతోష పడుతుంటాడేమో ఏమో అని అన్నారు.

అయితే పబ్ సీన్‌లో అంబటి రాంబాబు పాత్రను పోలిన సీన్‌లో నటించిన పృథ్వీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అంబటి రాంబాబు లాంటి పెద్దాయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనను అనుకరించేంత ఆస్కార్ నటుడే కాదు. ఆయనను ఇమిటేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మా జనసేన శ్రేణులు కూడా ఖండిస్తున్నారు. ఆ డ్యాన్స్ అలా ఉందని మేము అనుకోవడం లేదు. ఆయన మా కంటే గొప్పగా చేశారు. మా డ్యాన్స్ వేరు.. ఆయన డ్యాన్స్ వేరు అని అన్నారు.
తమను కించపరిచేలా ఉందని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్‌ను జోగి రమేష్ దారుణంగా దుర్బాషలాడారు. కించపరచడం అంటే అది. 2024 సంవత్సరం మాకు బాగుంది. పవన్ కల్యాణ్ నట విశ్వరూపం బ్రో సినిమా. అద్బుతం.. అమోఘం, ఆనందం వర్ణణాతీతం అని 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ అన్నారు.


Click it and Unblock the Notifications











