Bro Dance: అంబటి నాకు తెల్వదు.. అదో పనికిమాలిన క్యారెక్టర్.. అందుకే అలా: పృథ్వీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ మూవీ బ్రో. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు సాయిధరమ్, దర్శకుడు సముద్ర ఖనితో పాటు చిత్ర నటులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పాత్ర ఎలాంటి.. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే అంశాలపై మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే...
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ బ్రో. ఇక ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ సంగీతం అందించాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో చిత్రబృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సక్సెస్ మీట్ లో పృథ్వీ మాట్లాడుతూ... చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఈ క్యారెక్టర్ తనకు మంచి పేరును తీసుకువచ్చిందని అన్నారు. రాగానే పొలిటకల్ కాంట్రవర్సీ అయిందన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో టైం వాల్యూ గురించి మంచి మెసేజ్ ఉందని తెలిపారు. హ్యూమన్ రిలేషన్స్ గురించి అద్భుతంగా చూపించారు.. సముద్రఖనికి హ్యాట్సాఫ్ అన్నారు.
ఇక తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ... నేను ఏదో డ్యాన్స్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసిన శ్యాంబాబు, రాంబాబు... ఒకరు మీరు మంత్రిగారిని డీగ్రేట్ చేయడం ఏంటి.. అని అడిగారు. నాకు అంబటి ఎవరో తెలియదు. ఆయనేమి ఆస్కార్ నటుడేమి కాదు.. ఇమిటేట్ చేయడానికి. నాకు సముద్రఖని ఏం చెప్పారంటే... ఓ పనికిమాలిన వెదవ, బాధ్యత లేని వెదవ.. బార్లలో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో తిరుగుతాడు అది క్యారెక్టర్ అంటే చేశాను. అంతే.. అని వివరణ ఇచ్చాడు.
పవన్ కల్యాణ్ తో నటించడం నా అదృష్టం, ఇక ఆ సీన్ కు అంత క్రేజ్ రావడానికి కారణం మా దర్శకులు, టీం. థ్యాంక్స్. అందరూ అద్భుతమైన సినిమా చూశామని అంటున్నారు. ఇక తేజ్ గారు ఆడియోన్స్ లో మీకు ఓ పేరు ఉంది. చిరంజీవిలాగా ఉన్నారని అంటున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సముద్రఖని గారికి థ్యాంక్స్. ఇక శ్యాంబాబు క్యారెక్టర్ లాంటి మరిన్నీ క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పుకొచ్చాడు పృథ్వి.

ఇక ఈ సినిమాలో పబ్ సీన్‌లో యాక్టర్ 30 ఇయర్స్ ఇంఢస్ట్రీ పృథ్వీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన సన్నివేశంపై మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీన్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబును ట్రోల్ చేయడానికే పెట్టిందనే విషయం చర్చనీయాంశమైంది. దీనిపై పృథ్వి కామెంట్స్ చేయగా.. మరి అంబటి రాంబాబు ఏమైనా స్పందిస్తాడా లేదా చూడాలి.


Click it and Unblock the Notifications











