For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రూమ్‌ నెంబర్‌ 302లో వెన్నెల కిషోర్.. ఓ కండోమ్‌ ప్యాకెట్‌ కావాలంటూ హీరోయిన్ ఫోన్! వైరల్ వీడియో..

  |

  సినీ పరిశ్రమలో కొత్త తరం సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. చిన్న సినిమాల హవా మరీ ఎక్కువైపోయింది. అయితే ఈ చిన్న సినిమాలు రూపొందించే దర్శకనిర్మాతలు ఎక్కువగా అడల్ట్ కంటెంట్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్ హంగామా మరీ ఎక్కువైపోయింది.

  బెడ్ రూమ్ సీన్స్, సెక్స్ సన్నివేశాలు

  బెడ్ రూమ్ సీన్స్, సెక్స్ సన్నివేశాలు

  శృతిమించిన బెడ్ రూమ్ సీన్స్, సెక్స్ సన్నివేశాలు చూపిస్తూ నేటి యువతరాన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫిలిం మేకర్స్. ఇప్పటికే ఈ కోవలో ''7 చేపల కథ, చీకటి గదిలో చితక్కొట్టుడు, డిగ్రీ కాలేజ్'' లాంటి సినిమాలు చేరగా.. తాజాగా 302 మూవీ కూడా చేరిపోయింది.

  భవికా దేశాయ్, వెన్నెల కిశోర్ ఇన్ 302

  భవికా దేశాయ్, వెన్నెల కిశోర్ ఇన్ 302

  కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన చిత్రం 302. ''ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్'' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో భవికా దేశాయ్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 13వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

  వైరల్ వీడియో.. అన్నీ అవే సీన్లు

  వైరల్ వీడియో.. అన్నీ అవే సీన్లు

  ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. కమిడియన్ సునీల్ చేత 302 ట్రైలర్ లాంచ్ చేయించింది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అంతా అడల్ట్ కంటెంట్ తోనే నింపేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ట్రైలర్ చూస్తుంటే ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.

  రూమ్‌ నెంబర్‌ 302కి ఓ కండోమ్‌ ప్యాకెట్‌ కావాలి

  రూమ్‌ నెంబర్‌ 302కి ఓ కండోమ్‌ ప్యాకెట్‌ కావాలి

  'హలో.. రూమ్‌ నెంబర్‌ 302కి ఒక కండోమ్‌ ప్యాకెట్‌ కావాలి' అనే హీరోయిన్ డైలాగ్ తో ఈ ప్రారంభమయిన ఈ ట్రైలర్.. ఆద్యంతం యూత్‌ని ఆకర్షిస్తోంది. చివర్లో అదే హీరోయిన్ దయ్యంగా మారినట్లు కనిపించడంతో టీజర్‌ ముగుస్తుంది. క్రైమ్, సస్పెన్స్, కామెడీ అంశాలతో పాటు కాస్త హారర్ అంశాలను మేళవించి ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

  తల్లితండ్రులతో గొడవపడి.. 24 గంటల్లో

  తల్లితండ్రులతో గొడవపడి.. 24 గంటల్లో

  ఇక ఈ సినిమా గురించి దర్శకుడు కార్తికేయ మిరియాల మాట్లాడుతూ.. ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని మలిచామని అన్నాడు. ఒక్క రోజులో అంటే 24 గంటల్లో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లితండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే అని అన్నాడు. కడుపుబ్బ నవ్వించే కామెడీ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయని తెలిపాడు.

  Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !

  302 మూవీ

  ఈ 302 చిత్రంలో వేణు టిల్లు, జబర్దస్త్ రాకేష్, నవీన్, దేవీచరణ్ తదితరులు నటించారు. అవినాష్ సుందరపల్లి నిర్మించారు. ఏదేమైనా ట్రైలర్ మాత్రం సినిమాపై ఆసక్తి రేకెత్తించింది.

  English summary
  Bhavika Desai, Vennela Kishore palyed lead roles in 302 movie. Now this movie trailer released and going sensationally in youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X