384 సినిమాలతో పోటీపడి.. నివేదా థామస్ మూవీ రేర్ ఫీట్

అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్. ఏ రోల్ ఇచ్చిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో ఈవిడది అందెవేసిన చేయి. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్‌ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నివేదా. తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె .. నిన్నుకోరి, జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118, బ్రోచేవారెవరు రా , వకీల్ సాబ్‌, శాకినీ డాకినీ అంటూ పలు చిత్రాలలో నటించారు. తాజాగా నివేదా థామస్ నటించిన తెలుగు చిత్రం అరుదైన ఘనతను అందుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

నివేదా థామస్ లేటెస్ట్ మూవీ35 చిన్న కథ కాదు. నంద కిశోర్ దర్శకత్వంలో రానా, సృజన్ యరబోలు, సిద్ధార్ధ్ రాళ్లపల్లి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌లు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో నివేదా థామస్ ఇద్దరు పిల్లల తల్లిగా నటించారు. 28 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆమె ఈ రోల్ పోషించడం సాహసమనే చెప్పాలి. ఆమె గట్స్‌కు , వృత్తిపట్ల నివేద అంకితభావానికి నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే.

35 Chinna Katha Kaadu selected for the Prestigious Indian Panorama 2024 at the 55th IFFI Goa

అంతేకాదు.. 35 చిన్న కథ కాదు సినిమాలో తన పాత్ర కోసం నివేదా థామస్ భారీగా బరువు పెరిగారు. విద్యావ్యవస్ధ, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్ వంటి బంధాల గురించి చాలా అద్భుతంగా ఈ సినిమాలో వివరించారు. సెప్టెంబర్ 6న రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. లెక్కల్లో వీక్ అయిన కొడుకుని టెన్త్ ఫెయిలైన ఓ తల్లి ఎలా గాడిలో పెట్టిందనేది ఈ చిత్ర కథ. తెరపై చూస్తున్నంత సేపు సరస్వతి అనే ఇల్లాలే కనిపిస్తుంది తప్పించి నివేదా థామస్ కనిపించదంటే ఆమె ఎలాంటి ముద్ర వేశారో అర్ధం చేసుకోవచ్చు.

దాదాపు రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రపంచవ్యాప్తంగా 350 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజై పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఈ సినిమా పర్వాలేదని అనిపించుకుంది. ఇక ఆహా ఓటీటీలో రిలీజైన 35 చిన్న కథ కాదు .. అక్కడ మాత్రం భారీ విజయాన్ని అందుకుందని విశ్లేషకులు అంచనా వేశారు. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గోవాలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దీనిని ప్రదర్శించనున్నారు.

పనాజీలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఫెస్టివల్‌లో మొత్తం 25 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం దాదాపు 384 చిత్రాలు పోటీపడగా.. తెలుగు నుంచి స్టార్లు, సూపర్‌ స్టార్లను ఎదుర్కొని 35 చిన్న కథ కాదు షార్ట్ లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా గర్వకారణమని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు హీరోయిన్ నివేదా థామస్ సహా యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X