వెంటాడుతోన్న గేమ్ ఛేంజర్.. దిల్‌రాజుపై కేసు, 350 మంది మూకుమ్మడిగా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఎన్నో అవాంతరాలను దాటుకుని సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మిక్స్‌డ్ టాక్ కారణంగా ఈ సినిమా దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. అయినప్పటికీ చరణ్ - శంకర్ క్రేజ్‌తో పడుతూ , లేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే నిర్మాత దిల్‌రాజ్‌కు ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షాకుల మీద షాకులిస్తోంది.
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే మార్నింగ్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న గేమ్ ఛేంజర్‌కు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మరింత దెబ్బ తీసింది. కొందరైతే ఏకంగా గేమ్ ఛేంజర్ హెచ్‌డీ ప్రింట్‌ను తీసి ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేయడంతో ఈ సినిమాపై భారీ ఎఫెక్ట్ పడింది. ఇక సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలోనూ దుమారం రేగింది. కావాలని ఫేక్ కలెక్షన్స్ వేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. ఈ సినిమాతో నిర్మాత దిల్‌రాజ్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని దిల్‌రాజు.. ఖర్చుకు వెనుకాడకుండా గేమ్ ఛేంజర్‌ను నిర్మించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోగా ఆయనను పీకల్లోతు అప్పుల్లో ముంచెత్తిందని ఫిలింనగర్ టాక్. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా దిల్‌రాజు నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. అయితే ఇదే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం లాభాల పంట పండించడంతో దిల్‌రాజు కాస్తంత కోలుకున్నారు.

తాజాగా ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కు మరో గట్టి షాక్ తగిలింది. తమకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వలేదంటూ దిల్‌రాజుపై కొందరు జూనియర్ ఆర్టిస్టులు కేసు పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమాలో పనిచేసేందుకు 350 మంది ఆర్టిస్టులు హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి రోజుకు రూ.1200 చొప్పున పేమెంట్ ఇస్తామని కో డైరెక్టర్ స్వర్గం శివ హామీ ఇచ్చారట. అయితే సినిమా రిలీజై రోజులు గడుస్తున్నా నేటి వరకు ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఈ 350 మంది జూనియర్ ఆర్టిస్టులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తమకు న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై దిల్‌రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











