చిరంజీవి కోసం డేర్ చేస్తున్న నిర్మాతలు: ముప్పై నిమిషాల కోసం రూ. 4 కోట్లు
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. 'ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో, ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. ఇది కొంచెం నిరాశ పరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
కొరటాల శివ తన ప్రతి సినిమానూ సందేశాత్మకంగా తెరకెక్కిస్తుంటారు. దీనిని కంటిన్యూ చేస్తూ చిరంజీవితో చేస్తున్న 'ఆచార్య'లోనూ దేవాదాయ భూముల ఆక్రమణలకు సంబంధించిన మెసేజ్ ఇవ్వబోతున్నారట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ ఆఫీసర్‌గా, నక్సలైట్‌గా రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం రూ. 4 కోట్లతో ఓ సెట్ నిర్మిస్తున్నారట. ఇందులో ఓ పురాతన దేవాలయంతో పాటు దేవాదాయ శాఖ కార్యాలయానికి సంబంధించిన సెట్లు ఏర్పాటు చేయనున్నారని సమాచారం. కేవలం ముప్పై నిమిషాల పాటు ఉండే సీన్స్ కోసం నిర్మాతలు ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నారట.
ఇదిలా ఉండగా.. కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆచార్య'లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషించబోతున్నాడు. వీరితో పాటు ఈ మూవీలో కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద స్వామి విలన్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మణిశర్మ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











