RRR కోసం అమెరికా నుంచి 40 మంది: ఎన్టీఆర్, చరణ్‌కు చెమటలు పట్టిస్తారట

టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి.. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి చేస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినీ చరిత్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయనున్న నేపథ్యంలో షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నాడు. ఇందుకోసం ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే క్లైమాక్స్ పార్ట్ ప్రారంభం అయినట్లు కూడా చిత్ర యూనిట్ తెలిపింది.

హైదరాబాద్ నగర శివారులోని శేరిలింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో RRR క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ కొద్ది రోజులుగా జరుగుతోంది. ఇందుకోసం వందల మంది ఫైటర్లకు 150 రోజుల ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సోలోమన్ రాజు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్లకు తోడు ఇప్పుడు అమెరికా నుంచి మరో 40 మంది వచ్చారట. క్లైమాక్స్ ఫైట్‌లో హీరోలిద్దరూ తెల్లదొరలతో పోరాటం చేయాల్సి ఉంటుంది కాబట్టి.. అక్కడి వాళ్లను పిలిపించినట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు లోకల్‌గా ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటారని టాక్.

40 USA Fighters Came for RRR Climax

విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న RRRను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందులో చరణ్‌కు జోడీగా ఆలియా భట్.. తారక్‌ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X