400 ఏళ్ల పురాతన గుడిలో ప్రేమ పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో హీరోయిన్స్.. అక్కడే ఎందుకంటే
దాదాపు ప్రతి సినీ ఇండస్ట్రీలో కూడా సినీ తారల నడుమ ప్రేమలు పెళ్లిళ్లు తరచుగా వింటూనే ఉంటాము చూస్తూనే ఉంటాము. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి మన ఇండియన్ సినిమా దగ్గర నార్త్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హీరో లేదా హీరోయిన్ కి వయస్సు నడుమ చాలా తేడా ఉంటుంది.
అయితే హీరో ఏజ్ చాలా ఎక్కువ ఉంటుంది లేదా తాను ప్రేమించే హీరోయిన్ వయస్సులో పెద్దగా ఉంటుంది. ఇలా కొన్ని డిఫరెంట్ ప్రేమ పెళ్లిళ్లు కూడా కనిపిస్తాయి. అయితే మన సౌత్ లో కూడా కొన్ని రేర్ కేసుల్లో ఇలాంటి కాంబినేషన్ లు కనిపిస్తాయి. ఇక మరికొందరు అయితే చాలా ఏజ్ బార్ అయ్యాక తమ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. కాగా ఇలా 37 ఏళ్ల హీరోయిన్.. 45 ఏళ్ల హీరో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయ్యారు.

ఆ ఇద్దరే హీరో సిద్ధార్థ్ ఇంకా అదితి రావు హైదరిలు. ఇంట్రెస్టింగ్ గా ఇద్దరికీ ఇంత ఏజ్ అంటే ఎవరూ నమ్మలేరు కానీ వారి ఏజ్ లు పెద్ద మొత్తమే అయితే ఈ ఏజ్ లో వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. కాగా గత కొన్నేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమాయణం కొనసాగిస్తుండగా కొన్ని నెలలు కితమే ఆ రూమర్స్ ని నిజం చేస్తూ ఇద్దరూ తమ ప్రేమ మేటర్ ని బహిర్గతం చేశారు.
కాగా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న వీరు పెళ్లి ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారగా ఇప్పుడు వీరి పెళ్లిపై ఓ ఆసక్తికర అప్డేట్ తెలుస్తుంది. దీనితో ఈ పెళ్లి విషయంలో ఫైనల్ డెసిషన్ అదితినే తీసుకోబోతుంది అని తెలుస్తుంది. ఈమెకి గ్రాండ్ గా ఎక్కడెక్కడో సెట్స్ వేసుకొని కాకుండా మన దగ్గరే తెలుగు స్టేట్ లో ఉన్నటువంటి 400 ఏళ్ల కాలం నాటి పురాతన గుడిలో సిద్ధార్థ్ ని పెళ్లాడాలని కోరుకుంటుందట.

ఇలా తెలంగాణాలో వనపర్తిలో ఉన్నటువంటి 400 ఏళ్ల నాటి పురాతన శ్రీరంగపురం ఆలయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. కాగా అక్కడే ఎందుకంటే ఆమెకి తన కుటుంబానికి ఆ ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉందని అందుకే బయట ఎక్కడో చేసుకునే కంటే అక్కడే చేసుకోవాలని ఆమె డెసిషన్ తీసుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.
అయితే అదితి తనకి కాబోయేవాడిని ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో వెల్లడించింది కానీ ఎప్పుడు చేసుకుంటుందో అనేది మాత్రం వెల్లడించలేడు. సో ప్రస్తుతానికి వీరి పెళ్లి ఇంకా సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి. కాగా సిద్ధార్థ్ ఇటీవల నటించిన "భారతీయుడు 2" సినిమాతో పలకరించగా అదితి రావు హైదరి హిందీలో చేసిన భారీ వెబ్ సిరీస్ "హీరామండి" తో పలకరించింది. ఇలా ప్రస్తుతానికి ఇద్దరూ తన పర్శనల్ లైఫ్ సహా ప్రొఫిషనల్ లైఫ్ పరంగా కూడా బిజీగానే కనిపిస్తున్నారు. ఇక ఆ ఒక్కటయ్యే డేట్ కోసం వీరి ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











