ట్రెండ్ సెట్ చేసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ.. బర్త్ డేపై గురి!
టాలీవుడ్‌లో ప్రస్తుతం బర్త్ డే ట్రెండ్‌లు రాజ్యమేలుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. తమ తమ హీరోల అభిమానుల ఆధిపత్యం కొనసాగించేలా చూసేందుకు ఫ్యాన్స్ తెగ తొందర పడుతున్నారు. ఈ మేరకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్దాన్ని చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్, బన్నీ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ల దుమ్ములేపారు.
మహేష్ బాబు దాదాపు 62 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డు నెలకొల్పగా.. దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బద్దలు కొట్టారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు 65 మిలియన్ల ట్వీట్లతో ప్రపంచ రికార్డును క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ వంత వచ్చింది. ఇంత వరకు రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి అప్డేట్స్‌తో ట్రెండ్ చేశారు. కానీ ఇక ఇప్పుడు బర్త్ డే ట్రెండ్ చేసేందుకు సమయం వచ్చింది.

నేటి సాయంత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ మొదలెట్టారు. ప్రభాస్ బర్త్ డే ఇంకా 41 రోజులే ఉందని #41DaysToREBELSTARBDay హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేయడం మొదలెట్టారు. ఇక మిలియన్ల ట్వీట్లతో ప్రభంజనం సృష్టించేందుకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్నారు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ప్రభాస్ బర్త్ డే ( అక్టోబర్ 23) నాడు ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతుందో చూడాలి. రాధేశ్యామ్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మధ్యే ఆదిపురుష్ అప్డేట్ ఇస్తూ లంకేషుని పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించబోతోన్నట్టు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











