నేటి నుంచి ఎఫ్2లో 5 కొత్త సన్నివేశాలు.. మరింత జోష్!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ వినోదాత్మకపు చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుత రెస్పాన్స్ వస్తోంది. చిత్రం మూడవ వారంలోకి ఎంటర్ అవుతున్నా జోరు తగ్గడం లేదు. ఇప్పటికే ఎఫ్2 చిత్రం 100 కోట్ల గ్రాస్ సాధించింది. తమన్నా, మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

చాలా కాలం తర్వాత వెంకీ తనదైన శైలిలో కామెడీ పండించడంతో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ కూడా తెలంగాణ యాసలో బాగా నటించాడు. ప్రియదర్శి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ పాత్రలు కూడా బావున్నాయి. ఇదిలా ఉండగా వసూళ్ల జోరు మరింతగా పెంచేందుకు ఎఫ్2 చిత్ర యూనిట్ కొత్త ప్లాన్ వేసింది. ఎఫ్2 చిత్రంలో నేటి నుంచి 5 కొత్త సన్నివేశాలు చేర్చబోతున్నట్లు ప్రకటించారు.

5 new scenes added for Venkatesh, Varun Tej F2 from today

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అవసరమైన ఎనర్జిటిక్ ఆల్బమ్ అందించాడు. ఎఫ్ 2 చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది వరుసగా నాలుగో విజయం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X