‘పద్మాలయ’కు యాభై ఏళ్లు.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
తెలుగు సినీ చరిత్రలో పద్మాలయ స్టూడియోస్‌ది ప్రత్యేక స్థానం. సూపర్ స్టార్ కృష్ణ తన సొంత బ్యానర్ అయిన పద్మాలయపై ఎన్నో మరుపురాని చిత్రాలను నిర్మించాడు. తెలుగు చిత్ర సీమను మలుపుతిప్పే చిత్రాలెన్నో పద్మాలయ నిర్మించింది. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం ఇలా చెప్పుకుంటే పోతే అది ఓ చరిత్రే అవుతుంది. అంతటి గొప్ప బ్యానర్‌ను స్థాపించి నేటికి యాభై యేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
పద్మాలయకు యాభై యేళ్లు పూర్తి కావడంతో మహేష్ బాబు.. 'యాభై యేళ్ల క్రితం ఈ రోజు పద్మాలయ స్టూడియో ప్రయాణం మొదలైంది. ఎంతో గొప్ప ప్రయాణం. దీన్ని స్థాపించిన మెంబర్స్‌కు కంగ్రాట్స్. అంతేకాకుండా ఈ బ్యానర్‌లో మన తెలుగు ప్రేక్షకుల కోసం నిర్మించిన ఎన్నో ఐకానిక్ చిత్రాలు, వాటి వెనుకున్న టీమ్‌కు కంగ్రాట్స్'అని ట్వీట్ చేశాడు.

ఇక సుధీర్ బాబు సైతం పద్మాలయపై స్పందించాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'పద్మాలయకు యాభై యేళ్లు నిండాయి. సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు ఆది శేషగిరిరావు, హనుమంత రావుగారి పట్ల నాకెంతో గర్వంగా ఉంది. సూపర్ స్టార్‌లానే దీని ఖ్యాతి ఎప్పటికీ నిలిచే ఉంటుంద'ని చెప్పుకొచ్చాడు. సూపర్ స్టార్ కృష్ణ తన సోదరులను నిర్మాతలుగా మార్చి.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను పద్మాలయ స్టూడియోస్‌పై నిర్మించారు.


Click it and Unblock the Notifications











