For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  50 years of Mammootty: మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్.. అదిరిపోయిన మమ్ముట్టి రిప్లై

  |

  సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే హీరో ఎవరంటే.. ఏ మాత్రం సందేహం లేకుండా ఠక్కున చిరంజీవి అని పేరు వస్తుంది. అయితే స్థాయిని చూడకుండా తన కంటే చిన్న వారిని, పెద్ద వారిని మర్యాదించే ఆయన తీరును గొప్పగా చెప్పుకొంటారు. ఆయన ప్రవర్తన, ఒదిగి ఉండే తీరు వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని ప్రతీ ఒక్కరు చెప్పుకొంటారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఉద్దేశించి చిరంజీవి ట్వీట్ చేయగా అందుకు మమ్ముట్టి స్పందించిన తీరు అద్భుతంగా ఆకట్టుకొంటున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

  సూపర్‌స్టార్లతో చిరంజీవి రిలేషన్

  సూపర్‌స్టార్లతో చిరంజీవి రిలేషన్

  దక్షిణాదిలోనే కాకుండా ఇండియాలోని సూపర్‌స్టార్స్ అందరితోను చిరంజీవి మమేకమై, ఆరోగ్యకరమైన బంధాలను కొనసాగిస్తుంటారు. అమితాబ్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి అగ్ర నటులతో తన బంధాన్ని చెప్పుకోవడానికి ఏ మాత్రం సంశయించరు. అందుకు సాక్ష్యంగా మరో సంఘటనకు చిరంజీవి, మమ్ముట్టి వేదికగా నిలిచారు.

  నటుడిగా మమ్ముట్టి 50 ఏళ్లు పూర్తి

  నటుడిగా మమ్ముట్టి 50 ఏళ్లు పూర్తి

  మమ్ముట్టి తన కెరీర్‌ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్నందున చిరంజీవి ఆయనను అభినందించారు. మమ్ముట్టి 1971లో కేఎస్ సేతు మాధవన్ దర్శకత్వం వహించిన అనుభవంగళ్ పాలిచకల్ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్ప టి నుంచి మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటి వరకు ఎన్నో ఉత్తమ నటుడిగా, రాష్ట్ర, జాతీయ అవార్డులు అందుకొన్నారు. నటుడిగా మమ్ముట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు.

  చిరంజీవి ట్వీట్ చేసి ఇలా..

  చిరంజీవి ట్వీట్ చేసి ఇలా..

  చిరంజీవి తన ట్వీట్‌లో మమ్ముకా (మమ్ముట్టి ముద్దుపేరు) చిత్ర సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాల ప్రయాణం చూసి నేను థ్రిల్ అయ్యాను. భారతీయ సినిమా తెరపై నీ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశావు. అంతేకాకుండా దేశం గర్వించే విధంగా నీ స్థానాన్ని ప్రజల హృదయాల్లో సుస్థిరం చేసుకొన్నావు. ఇలాంటి గొప్ప పరిశ్రమలో మీతో కలిసి ప్రయాణించాననే విషయం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా సినీ పరిశ్రమలో చాలా ఏళ్లు నీ నటనతో మ్యాజిక్ చేయాలి. ప్రేక్షకుల మనసులో గూడు కట్టుకోవాలి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

  చిరంజీవికి మమ్ముట్టి ధన్యవాదాలు

  చిరంజీవికి మమ్ముట్టి ధన్యవాదాలు

  చిరంజీవి కురిపించిన ప్రశంసలు, ఆప్యాయతకు మమ్ముట్టి సంతోషంలో మునిగిపోయారు. చిరంజీవి ట్వీట్‌కు బదులు ఇస్తూ.. థ్యాంక్యూ చిరు భాయ్. అద్భుతమైన మీలాంటి సహచరుల కారణంగానే నా జర్నీకి సార్థకత చేకూరింది. మన మధ్య అందమైన, విడదీయలేని అనుబంధం ఉంది. మీరు అన్నట్టు ఈ అద్భుతమైన పరిశ్రమలో భాగం కావడం ఒక వరం లాంటింది అంటూ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా జరిగిన చిరు, మమ్ముట్టి సంభాషణ వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందిస్తూ మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

  Shakeela Sensational Comments On Allu Arjun | ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
  చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు

  చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు


  ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాంచరణ్, పూజా హెగ్డే, సోను సూద్ నటిస్తున్నారు. అలాగే మలయాళ రీమేక్ లూసిఫర్, ఇంకా పలు చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆయన సినిమాల రిలీజ్ కాస్త వాయిదా పడుతు వస్తున్నాయి.

  English summary
  50 years of Mammootty in Indian Cinema. In this occassion, Megastar Chiranjeevi Wishes with Wonderful message. and Mammootty reply with magical words.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X