Elections 2024 ఓటుకు 5000.. అతడిని ఎమ్మెల్యే కానివ్వకుండా 100 కోట్లు!
రాజకీయాలంటే డబ్బు.. పైసలు లేకుండా పాలిటిక్స్ చేయడం ఈ రోజుల్లో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఓటుకు నోటు అనే పద్దతిలో ఎన్నికలు జరుగుతుండటం సహజమే. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వచ్చే రెండు నెలలు పొలిటికల్ సీజన్. ఈ క్రమంలో సినిమా రంగంలో కూడా పొలిటికల్ బేస్డ్ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. రాజకీయ, ఓటు నోటు, వందల కోట్లు ఖర్చు పెట్టడం లాంి అంశాలతో వస్తున్న చిత్రం లక్ష్మీ కటాక్షం. ఇటవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ క్రమంలో ఆ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..
లక్ష్మీ కటాక్షం సినిమా విషయానికి వస్తే.. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యే కావాలన్న రాజకీయ నేత (సాయికుమార్) ఒకరు. అలాగే ఎలక్షన్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టనివ్వకుండా అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ ఇన్స్‌పెక్టర్ (వినయ్) మధ్య జరిగిన సంఘర్షణనే ఈ మూవీ కథ. పొలిటిషియన్, పోలీస్ మధ్య జరిగిన కథను ప్రస్తుతం రాజకీయాలకు అనుగుణంగా తెరకెక్కించినట్టు తెలుస్తున్నది.

లక్ష్మీ కటాక్షం సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్తాన నేపథ్యం ఉన్న రాజకీయ నేత గెలుపుకు ప్లాన్ చేసుకోవడం కనిపించింది. అలాగే 200000 ఓటర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటుకు 5000 ఇవ్వాలని.. అలా 100 కోట్ల బడ్జెట్ సిద్దం చేసుకొన్నారు. ఈ విషయం తెలిసిన ఇన్స్‌పెక్టర్ అవినీతి, డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో ఎవరు గెలిచారనేది సినిమా కథగా కనిపించింది.
ఇక ఈ సినిమా కథ ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా కనిపించింది. విసన కర్ర, స్కూటర్ గుర్తులను చూపించారు. ఏపీలోని ఫ్యాన్స్, సైకిల్ గుర్తులను గుర్తు తెచ్చేలా సినిమాలో అంశాలను పొందుపరిచారు. రాజకీయాలకు తోడుగా ఓ ప్రేమ కథను కూడా జొప్పించారు. డబ్బు ఉన్న పిల్లను పడేసి.. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనే పేదింటి కుర్రాడు కల ఫలిచిందా? అనే తెరపైన చూడాల్సిందే.
మహతి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యు శ్రీనివాసులరెడ్డి, బీ నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన పొలిటికల్ సెటైర్ సినిమా లక్ష్మీ కటాక్షం. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ నటించిన ఈ సినిమాకు సూర్య తొలి చిత్ర దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అమ్మవారిగా ఆమని నటించారు.


Click it and Unblock the Notifications











