twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    5Ws' ఫస్ట్ లుక్: విజయశాంతి స్ఫూర్తితో.. పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ రాజ్‌పుత్!

    |

    RX 100 మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల భామ పాయల్ రాజ్‌పుత్ మరోసారి హీరోయిన్‌ ఓరియెంటెడ్ మూవీలో కనిపించనున్నారు. ఐపీఎస్ అధికారిగా పాత్రలో కనిపించనున్న పాయల్ రాజ్‌పుత్ చిత్రానికి 5Ws (who, what, when, where, why) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు' అనేది ఉపశీర్షిక. ప్రముఖ గుణశేఖర్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రం ద్వరా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత శివకుమార్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

    అనంతరం పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ "ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. చాలా రోజులుగా ఈ సినిమా గురించి మౌనంగా ఉన్నాను. ఇకపై మాట్లాడవచ్చు. '5Ws' అని టైటిల్ పెట్టారు. నాకు, నా కెరియర్‌కి కంప్లీట్‌గా కొత్త సినిమా ఇది. పోలీస్, ఐపీఎస్ రోల్ చేయాలని ప్రతి యాక్టర్ కలలు కంటారు. ఫైనల్లీ... అటువంటి గోల్డెన్ ఛాన్స్ నాకు వచ్చింది. నాపై, నా నటనపై నమ్మకం, విశ్వాసం ఉంచిన ప్రణదీప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఐపీఎస్ రోల్ చేయడం ఛాలెంజింగ్. నేను బాగా చేశానని అనుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్‌తో ఈ సినిమా చేశాను. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురుచూస్తున్నాను అని అన్నారు.

     5Ws movie first look: Payal Rajput as police officer

    ప్రణదీప్ గారు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఈ పాత్ర చేయడానికి నాకు విజయశాంతి గారు స్ఫూర్తి. ఆమె నటించిన చాలా సినిమాలు చూశాను. ఆవిడ పోలీస్ పాత్రలు చాలా చేశారు. ఈ '5Ws'లో కొత్తగా చేసే అవకాశం నాకు లభించింది. నేను ఏ సినిమా చేసినా... కొంత హోమ్ వర్క్ చేస్తా. నా ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి వాళ్ళతో డిస్కస్ చేశా. నేను ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా నటించాలి? ఎలా ప్రవర్తించాలి? అనేవి మా మధ్య డిస్కషన్ కి వచ్చాయి. ఇంతకు ముందు నన్ను 'ఆర్.ఎక్స్. 100', 'ఆర్.డి.ఎక్స్. లవ్', 'వెంకీమామ' సినిమాల్లో చూశారు. ఆ స్టీరియోటైప్ ఇమేజ్ బ్రేక్ చేసే సినిమా ఇది. స్టంట్స్ అన్నీ నేనే చేశా. మంచి ఫైట్స్, డైలాగులు కుదిరాయి." అని అన్నారు.

     5Ws movie first look: Payal Rajput as police officer

    దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ "ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పోలీసులు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసినా... ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఈ ఐదు ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ముందు ఈ సినిమాకు వేరే టైటిల్స్ చాలా అనుకున్నాం. ఏదీ యాప్ట్ అనిపించలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో ఈ కథ రాశా. కథ రాసే క్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఐజీ స్వాతి లక్రా గారు, డీఐజీ బి. సుమతి గారు, డీసీపీ అనసూయ గారు... ఇలా చాలామందిని కలిసి, పరిశోధన చేసి కథ రాశాను అని అన్నారు.

    నిర్మాత శ్రీమతి యశోదా ఠాకోర్ మాట్లాడుతూ ఒక రకంగా నేను స్త్రీవాదిని. నేను చేసే పనిలో, నా ఆలోచనల్లో ఎప్పుడూ మహిళా సాధికారత ఉంటుంది. నా భర్త తీస్తున్న సినిమా మహిళల గురించి, స్త్రీ శక్తి గురించి అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను, ప్రణదీప్ క్లాస్ మేట్స్. ఈ రోజు మా క్లాస్‌మేట్స్, థియేటర్ ఆర్టిస్టులు... అందరూ ఒక్కసారిగా వచ్చి ఇంత సపోర్ట్ ఇస్తుంటే స్నేహానికి ఉన్న శక్తి ఏంటో నిజంగా తెలిసి వస్తోంది అని అన్నారు.

    సాంకేతిక వర్గం:
    దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్
    నిర్మాత: శ్రీమతి యశోదా ఠాకోర్
    నిర్మాణ సంస్థ: కైవల్య క్రియేషన్స్
    ఛాయాగ్రహణం: అనిల్ బండారి
    సంగీతం: మహతి సాగర్
    సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్
    ఎడిటర్: ప్రవీణ్ పూడి
    స్టంట్స్: వెంకట్ మాస్టర్
    ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్
    రైటర్: తయనిధి శివకుమార్
    స్టిల్స్:ఎ. దాస్
    పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్
    వీఎఫ్ఎక్స్: అలగర్‌సామి మయాన్
    కోడైరెక్టర్: రాఘవేంద్ర శ్రీనివాస
    పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ & ఫణి కందుకూరి
    ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి
    లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే
    ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల
    కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు
    మేకప్: కోటి లకావత్

    English summary
    Payal Rajput, who is doing some crazy films will be seen in yet another female-oriented film called 5Ws(Who, Where, When, What and Why). The film's first look was launched yesterday in the Film Chamber, Hyderabad. Touted to be a crime thriller, the film is directed by Pranadeep Thakur, who earlier worked with Gunsekhar for several films. Yashoda Thakur produces this film on Kyvalya Creations banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X