ఈవారం థియేటర్లలోకి రాబోయే సినిమాలివే.. 6 కొత్తవి, 3 పాతవి.. కానీ చూడాల్సినవి మాత్రం అవే!

2024లోకి అడుగు పెట్టామో లేదో అనేక సినమాలు విడుదల అవుతున్నాయి. అద్భుతమైన కొత్త కొత్త చిత్రాలు వస్తూ సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. కొత్త వారం వచ్చిందంటే చాలు అనేక చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా అదిరిపోయే సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. ముఖ్యంగా మార్చి మొదటి వారంలోనే మొత్తం 9 తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో చాలా 6 కొత్త సినిమాలు ఉండగా.. మూడు పాత చిత్రాలు రీరిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటి.. ఇందులో కచ్చితంగా చూడాల్సినవి ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వంలో రాబోతున్న సినిమానే ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ సరసన మానిషి చిల్లర్ హీరోయిన్ గా నటించబోతుంది. ఈసినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నమోదు అయ్యాయి. చూడాలి మరి ఏ రేంజ్ లో ఈ సినిమా హిట్ కొట్టబోతుందనేది. అలాగే వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో రాబోతున్న చారి 111 సినిమా కూడా మార్చి ఒకటవ తేదీన విడుదల కాబోతుంది. స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా.. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది.

6 New Movies And 3 Old Movies Going To Release On Theatres March First Week 2024 Check Details

అలాగే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా కూడా మార్చి ఒకటవ తేదీన థియేటర్లలోకి రాబోతుంది. పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో శివ కందుకూరి, కల్ప లత, రాశి సింగ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నమోదు అయ్యాయి. చూడాలి మరి థియేటర్ల వద్ద ఏ రేంజ్ లో సందడి చేయనుందో. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరోహీరోయిన్లుగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో వచ్చిన కొత్త సినిమానే రాధా మాధవం. ఈ సినిమా కూడా మార్చి 1వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

అలాగే ఇంటి నెంంబర్ 13 అనే సినిమా కూడా మార్చి ఒకటవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పన్నా రాయల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సత్య కృష్ణన్, ఆనంద్ రాజ్, పృథ్వీ రాజ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే డెనిస్ విల్లెన్ యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన డూన్ 2 సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది. ఈ హాలీవుడ్ మూవీపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

6 New Movies And 3 Old Movies Going To Release On Theatres March First Week 2024 Check Details

ఇవి మాత్రమే కాకుండా మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమా, నటసింహం నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు కూడా మార్చి ఒకటవ తేదీన రీరిలీజ్ కాబోతున్నాయి. ఇన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా... ఇందులో చూడాల్సినవి మాత్రం ఆపరేషన్ వాలెంటైన్, చారి 111,, భూతద్దం భాస్కర్ నారాయమ, ఇంటి నెంబర్ 13లు. ఈ సినిమాలపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. చూడాలి మరి ఈ వారం ఏ చిత్రం హట్ గా నిలుస్తుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X