For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  6YearsofBaahubali:జక్కన్న ఫామిలీ నుంచి 15 మంది.. అందరికీ దణ్ణం అంటున్న ప్రభాస్!

  |

  తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా నేటికీ 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ సహా పలువురు తమ సోషల్ మీడియా వేదికగా ఈ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ వివరాల లోకి వెళితే

  సరిగ్గా ఆరేళ్ళ క్రితం

  సరిగ్గా ఆరేళ్ళ క్రితం

  అప్పటికి మిర్చి సినిమా పూర్తి చేసుకున్న ప్రభాస్ తో ఈగ సినిమా పూర్తి చేసిన రాజమౌళి బాహుబలి అనే సినిమా మొదలుపెట్టారు.. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు అప్పట్లో 180 కోట్లు పెట్టి సినిమా తీయడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డు. అలా ఎన్నో అంచనాలతో జూలై 10వ తేదీన ఈ సినిమా 2015 సంవత్సరంలో రిలీజ్ అయింది.

  రికార్డు కలెక్షన్స్

  రికార్డు కలెక్షన్స్

  నిజానికి ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. అలాగే హిందీ మలయాళం భాషలోకి డబ్బింగ్ చేసి మొత్తం నాలుగు భాషలలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల విడుదల చేశారు. సుమారు 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 650 కోట్ల రూపాయల బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టింది. ఒకరకంగా అతి పెద్ద రికార్డు అనే చెప్పాలి.

  విజయేంద్ర ప్రసాద్ ప్రోద్బలంతోనే

  విజయేంద్ర ప్రసాద్ ప్రోద్బలంతోనే

  ఇక ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి కల కారణం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఒకానొక సందర్భంలో శివగామి పాత్ర గురించి చెబుతూ ఒక తల్లి చేతిలో బిడ్డను పట్టుకుని ఎలా నదిని దాటిందనే కథ చెప్పాడట.. ఆ తర్వాత కొన్ని రోజులకు కట్టప్ప అనే ఒక క్యారెక్టర్ గురించి చెప్పడంతో ఇది జానపద సినిమాగా ఎందుకు చేయకూడదు అని భావించిన రాజమౌళి ఈ రెండింటిని కలుపుతూ ఒక కథ సిద్ధం చేయమని కోరారట. అలా సిద్ధమైంది బాహుబలి.

  ఒక్కో పాత్రకు ఒక్కో క్రేజ్

  ఒక్కో పాత్రకు ఒక్కో క్రేజ్

  శివుడిగా బాహుబలి, అవంతికగా తమన్నా, భళ్ళాల దేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, బిజ్జల దేవగా నాజర్, కట్టప్పగా సత్యరాజ్ ఇలా ఒక్కొక్కరు తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. సత్య రాజు అయితే తెలుగులో చాలామంది ఇప్పటికీ కట్టప్పగానే గుర్తిస్తూ ఉంటారు.

  అందరికీ ఒక దణ్ణం

  అందరికీ ఒక దణ్ణం

  అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ రానా ఇద్దరి మార్కెట్ భీభత్సంగా పెరిగిపోయింది.. రాజమౌళి మార్కెట్ కూడా ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయింది. ఈ సినిమా రెండో భాగం కూడా రెండేళ్ల తరువాత 2017 లో రిలీజ్ చేశారు. ఈరోజు సినిమా రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సినిమా మాయాజాల తరంగాలను సృష్టించిన బృందానికి ఒక దణ్ణం అంటూ సింబల్ పెట్టారు.

  జక్కన్న ఫామిలీ నుంచి 15 మంది

  జక్కన్న ఫామిలీ నుంచి 15 మంది

  అన్నట్టు ఈ సినిమా కోసం జక్కన్న ఫామిలీ మెంబర్స్ 15 మంది పని చేశారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాశారు, ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. రమ రాజమౌలి కాస్ట్యూమ్స్ చూసుకున్నారు. ఇక జక్కన్న కుమార్తె ఈ సినిమాలో 'సాహోరే బాహుబలి' పాటలో కూడా నర్తించింది. కుమారుడు కార్తికేయ రెండవ యూనిట్ డైరెక్టర్ గా చేశారు.

  English summary
  Baahubali completes 6 Years prabhas shared ''6YearsOfBaahubali: Here's to the team that created waves of cinematic magic all across the country and the world'' in his instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X