అలా మన్మథుడు 2 విడుదలైందో లేదో ఇలా రాహుల్ రవీంద్రన్‌కి జాతీయ అవార్డు
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కి జాతీయ చలన చిత్ర అవార్డుల్లో చోటు దక్కింది. అది కూడా ఆయన సినిమా విడుదల రోజే. తాజాగా ప్రకటించిన 66 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు కేటగిరీలో 'చి.ల.సౌ' చిత్రానికి గాను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అవార్డు దక్కించుకున్నాడు.
అంతకుముందే నటుడిగా గుర్తింపు పొందిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా 'చి.ల.సౌ'. దీంతో మొదటి సినిమానే జాతీయ చలన చిత్ర అవార్డుల్లో చోటు సంపాదించడం పట్ల ఆనందంగా ఉన్నారు రాహుల్ రవీంద్రన్, ఆయన భార్య చిన్మయి. ఈ మేరకు రాహుల్ రవీంద్రన్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది గాయని చిన్మయి.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ చిత్రంలో సుశాంత్ హీరోగా నటించగా రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ రామన్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా మన్మథుడు 2 ఈ రోజే (శుక్రవారం) విడుదలైంది. ఈ చిత్రంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. తన రెండో సినిమా విడుదల రోజే మొదటి సినిమాకు జాతీయ అవార్డు దక్కడం పట్ల ఆనందంగా ఉన్నారు రాహుల్ రవీంద్రన్.


Click it and Unblock the Notifications











