67th National Film Awards: ఉత్తమ నటుడు ధనుష్, మనోజ్ బాజ్‌పేయ్, ఉత్తమ నటి కంగన.. విజయ్ సేతుపతికి కూడా

ఉత్తమ చిత్రాలకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం పట్టం కట్టే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులను మార్చి 22వ తేదీన న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ సభ్యులు ప్రకటించారు. వాస్తవానికి ప్రతీ ఏడాది మే 3 తేదీన ఈ అవార్డులను ప్రకటిస్తారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ అవార్డుల ప్రకటనను వాయిదా వేశారు. చివరకు ఈ అవార్డులను ప్రకటించడానికి ముహుర్తాన్ని ఖరారు చేశారు.

 67వ జాతీయ అవార్డుల్లో

67వ జాతీయ అవార్డుల్లో

67వ జాతీయ అవార్డుల కార్యక్రమంలో మలయాళ చిత్రం మరక్కర్ అరబికడలింతే సింహం చిత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం 7 కేటగిరీలలో అవార్డు కోసం నామినేట్ అయింది. ఈ అవార్డుల రేసులో జల్లికట్టు, జెర్సీ, మహర్షి, అసురన్, మరక్కర్ అరబికడలింతే సింహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఫిచర్ ఫిలిం కేటగిరిలో...

ఫిచర్ ఫిలిం కేటగిరిలో...

ఉత్తమ చిత్రం: మరక్కర్ అరబికడలింతే సింహం (హీరో మోహన్ లాల్, దర్శకత్వం ప్రియదర్శన్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: మహర్షి (వంశీ పైడిపల్లి, దిల్ రాజు)
ఉత్తమ నటుడు: నటించిన ధనుష్ (అసురన్ చిత్రం), మనోజ్ బాజ్‌పేయ్ (భోంస్లే)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి - (తమిళంలో సూపర్ డీలక్స్)
ఉత్తమ నటి: కంగన రనౌత్.. (మణికర్ణిక, పంగా)
ఉత్తమ సహాయనటి: పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్ హిందీ)
ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్ - హిందీ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: మ్యాథూ కుట్టి జేవియర్ (మలయాళం)
ఉత్తమ బాలల చిత్రం: కస్తూరి (హిందీ)
నర్గీస్ దత్ జాతీయ సమైక్యత అవార్డు: తాజ్ మహల్ (మరాఠీ)
స్పెషల్ జ్యూరీ అవార్డు: ఉత్తా సెరప్పు సైజ్ 7 (తమిళంలో రాధాకృష్ణన్ పార్తీబన్ నిర్మించి దర్శకత్వం వహించారు)

టెక్నికల్ విభాగంలో

టెక్నికల్ విభాగంలో


బెస్ట్ ఎడిటర్: నవీన్ నూలీ - జెర్సీ (తెలుగు)
బెస్ట్ సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్ - జల్లికట్టు (మలయాళం)
బెస్ట్ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్: సావని రవీంద్ర - బార్డో (మరాఠీ)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: బీ ప్రాక్ (హిందీ చిత్రం కేసరీలో తెరీ మిట్టి)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: నాగ విశాల్ ( తమిళంలో కరప్పు దురై)

తెర వెనుక ప్రతిభావంతులు

తెర వెనుక ప్రతిభావంతులు


బెస్ట్ లిరిక్స్: మలయాళ చిత్రం కొలంబి - ప్రభా వర్మ.. (పాట: అరోదమ్ పారాయుక వయ్య)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: డీ ఇమ్మాన్ - విశ్వాసం (తమిళం), బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: ప్రభుద్ద బెనర్జీ - జేస్టోపుత్రో (బెంగాళీ)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: రంజిత్ - హెలెన్ చిత్రం (మలయాళం)
ఉత్తమ క్యాస్టూమ్ డిజైనర్: సుజిత్ సుధాకరన్ అండ్ వీ సాయి - మరక్కర్ అరబిక్కదాలింతే సింహం (మలయాళం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సునీల్ నిగ్వేకర్ అండ్ నీలేష్ వాగ్ - ఆనంద్ గోపాల్ మూవీ (మరాఠీ)

నాన్ ఫీచర్ ఫిలిం అవార్డు కేటగిరీలో

నాన్ ఫీచర్ ఫిలిం అవార్డు కేటగిరీలో

బెస్ట్ ఫిల్మ్ ఆన్ ఫ్యామిలీ వ్యాల్యూస్: ఓరు పాతిరా స్వప్నం పోలే

బెస్ట్ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: కస్టడీ
స్పెషల్ జ్యూరీ అవార్డు: స్మాల్ స్కేల్ సొసైటీస్
బెస్ట్ యానిమేషన్ ఫిలిం: రాధా
బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫిలిం: జక్కల్
బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: వైల్డ్ కర్ణాటక
బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: యాపిల్స్ అండ్ ఆరేంజెస్
బెస్ట్ సోషల్ ఇష్యూస్: హోలీ రైట్స్ అండ్ లాడ్లీ
బెస్ట్ ఎన్విరాన్‌మెంటల్ ఫిలిం: ది స్టార్క్ సావియర్
బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: ది షవర్
ది బెస్ట్ ఆడియోగ్రఫి: రాధా
బెస్ట్ సినిమాటోగ్రఫి: సోన్సీ, సవితా సింగ్
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్: సోహిణి చటోపాధ్యాయ్
బెస్ట్ బుక్ ఆన్ సినిమా: ఏ గాంధీయన్ అఫైర్: ఇండియా పోర్ట్రేయల్ ఆఫ్ లవ్ ఇన్ సినిమా (రచయిత సంజయ్ సూరి)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X