National Film Awards 2022 Winners List: అసలైన భీమ్లా నాయక్ మోత.. ఏకంగా నాలుగు అవార్డులు

68వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌ లో ప్రకటించడం జరిగింది. 2020 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వగలహించింది.

కోవిడ్ పరిస్థితుల కారణంగా గత ఏడాది నేషనల్ ఫిలిం అవార్డ్స్ ను ప్రకటించలేకపోయారు. అందుకే ఈ ఏడాది 2020లో విడుదలైన సినిమాలకు అవార్డులను అనౌన్స్ చేశారు. ఇక ఈ క్రమంలో దేశంలో వివిధ భాషలకు చెందిన సినిమాలకు నటీనటులకు టెక్నీషియన్స్ కు అవార్డులను ప్రకటించారు.

 జాతీయ స్థాయిలో గుర్తింపు

జాతీయ స్థాయిలో గుర్తింపు

ఇక అసలైన భీమ్లా నాయక్ సినిమాకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు అయితే లభించింది. మలయాళం ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమా తెలుగులో భీమ్లా నాయక్ సినిమాగా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఇక ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమార్ నటించగా తెలుగులో పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి నటించారు.

ఉత్తమ డైరెక్టర్

ఉత్తమ డైరెక్టర్

అహంకారానికి ఆత్మగౌరవానికి కొనసాగిన ఈ సినిమా కథ చాలామందిని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఇక సినిమాకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించడం విశేషం. నేషనల్ అవార్డ్స్ లో నాలుగు కేటగిరీలలో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. మొదట డైరెక్టర్ సాచికి ఉత్తమ దర్శకుడిగా ఈ సినిమాకు అవార్డును ప్రకటించారు. పోలీస్ పాత్రలో నటించిన బీజూ మీనన్ కు ఉత్తమ సహా నటుడిగా పురస్కారాన్ని ప్రకటించారు.

మొత్తం నాలుగు

మొత్తం నాలుగు

సినిమాలో కేరళ నేటివిటీగా తగ్గట్టుగా పాటను పాడిన నెంజయమ్మకు బెస్ట్ ఫిమేల్ సింగర్ గా ప్రకటించడం జరిగింది. సినిమాకు వర్క్ చేసిన యాక్షన్ కొరయోగ్రాఫర్ కు మాఫియా శశి కి కూడా బెస్ట్ యాక్షన్ కొరయోగ్రాఫర్ గా అవార్డును అందుకుంటున్నాడు. ఇలా మొత్తంగా ఈ సినిమాకు వివిధ అంశాల్లో మొత్తం నాలుగు అవార్డులు వచ్చాయి.

సూర్యకు బెస్ట్ యాక్టర్

సూర్యకు బెస్ట్ యాక్టర్

ఇక ఓటీటీల విడుదలైన సురారై పొట్రు సినిమాకు గాను హీరో సూర్యకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సూర్య పేరు వైరల్ గా మారిపోయింది. తప్పకుండా ఈసారి సూర్య అవార్డును సొంతం చేసుకుంటాడు అని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక అనుకున్నట్లే అతను గెలిచాడు. ఇక హిందీలో తానాజీ సినిమాలో నటించిన అజయ్ దేవగన్ కు కూడా ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.

 తెలుగులో ఆ సినిమాలకు

తెలుగులో ఆ సినిమాలకు

తెలుగులో అయితే కలర్ ఫోటోకు ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఇక అల.. వైకుంఠపురంలో సినిమా కూడా నేషనల్ అవార్డు ఒక కేటగిరీలో దక్కింది. బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ కు నేషనల్ అవార్డు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలు అతనికి ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన నాట్యం సినిమాకు గాను ఉత్తమ మేకప్ , ఉత్తమ కొరియోగ్రఫీ క్యాటగిరీలో సంధ్యారాజు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X