National Film Awards 2022 Winners List: ఊహించినట్లే సూర్యకు నేషనల్ అవార్డ్.. బెస్ట్ యాక్టర్ లో మరో హీరో కూడా.
68వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో ప్రకటించడం జరిగింది. 2020 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలకు గౌరవాలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంది. కోవిడ్ పరిస్థితుల కారణంగా గత ఏడాది నేషనల్ ఫిలిం అవార్డ్స్ ను ప్రకటించలేకపోయారు. అందుకే ఈ ఏడాది 2020లో విడుదలైన సినిమాలకు అవార్డులను అనౌన్స్ చేశారు. ఇక ఈ క్రమంలో దేశంలో వివిధ భాషలకు చెందిన సినిమాలకు నటీనటులకు టెక్నీషియన్స్ కు అవార్డులను ప్రకటించారు.
ఇక ఓటీటీల విడుదలైన సురారై పొట్రు సినిమాకు గాను హీరో సూర్యకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సూర్య పేరు వైరల్ గా మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా నేషనల్ అవార్డులను ప్రకటించబోతున్నారు అనగానే ఎక్కువగా అందరూ సూర్య పేరును వైరల్ అయ్యేలా చేశారు. తప్పకుండా ఈసారి సూర్య అవార్డును సొంతం చేసుకుంటాడు అని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

ఇక హిందీలో తానాజీ సినిమాలో నటించిన అజయ్ దేవగన్ కు కూడా ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. తానాజీ సినిమాలో అతను నటించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక తెలుగులో అయితే కలర్ ఫోటోకు ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఇక అలా.. వైకుంఠపురంలో సినిమా కూడా నేషనల్ అవార్డు ఒక కేటగిరీలో దక్కింది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ కు నేషనల్ అవార్డు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలు అతనికి ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన నాట్యం సినిమాకు గాను ఉత్తమ మేకప్ , ఉత్తమ కొరియోగ్రఫీ క్యాటగిరీలో సంధ్యారాజు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











