69th National Film Awards: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. 69 ఏళ్లలో మొట్టమొదటి తెలుగు హీరోగా రికార్డు

69వ జాతీయ అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24 వ తేదీన సాయంత్రం లాంఛనంగా ప్రకటించింది. 2021కు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా అనేక విభాగాల్లో అవార్డు విజేతలను వెల్లడించింది. దేశంలో చలన చిత్రాలకు నేషనల్ ఫిల్మ్ అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే 2021 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల ప్రకటన వచ్చేసింది. అయితే 69 ఏళ్లలో తొలిసారిగా తెలుగు హీరోకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. ఆ వివరాల్లోకి వెళితే...

69వ జాతీయ అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించింది. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు సినిమాలు హవా చూపించాయి. ముఖ్యంగా పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు పోటా పోటీగా నిలిచాయి. ఇక 69 ఏళ్లలో తొలిసారిగా తెలుగు హీరోకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. పుష్ప చిత్రానికి గానూ అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది.

69th National Film Awards : Allu Arjun Won the Best Actor Male Award For Pushpa The Rise RRR bags Most Awards

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా 2021 డిసెంబర్ లో రిలీజ్ అయి.. సంచలనం సృష్టించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇక పుష్ప చిత్రానికి గానూ 69 ఏళ్లలో తొలిసారిగా తెలుగు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍ కు జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు దక్కించుకున్న తొలి యాక్టర్ గా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా జాతీయ అవార్డుల పంట పండింది.

పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలకు వచ్చిన అవార్డులు విషయానికి వస్తే.. బెస్ట్ యాక్టర్ - అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) - దేవీ శ్రీప్రసాద్ (పుష్ప: ది రైజ్)కు అవార్డులు లభించాయి. ఇక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - కాలభైరవ (ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో పాట), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ - కింగ్ సోలోమాన్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - వీ శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) అవార్డులు వచ్చాయి.

ఇక బెస్ట్ లిరిక్స్ - చంద్రబోస్ (కొండపొలం - ధమ్ దమాధమ్) రాగా... బెస్ట్ తెలుగు సినిమా - ఉప్పెన నిలిచింది. స్పెషల్ జ్యూరీ అవార్డ్ - విష్ణువర్ధన్ (షేర్ షా), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - షేర్షా, బెస్ట్ ఎడిటింగ్ - సంజయ్ లీలా భన్సాలీ (గంగూభాయ్ కఠియవాడి), బెస్ట్ స్క్రీన్ ప్లే - షాహీ కబీర్ నయట్టు (మలయాళం), బెస్ట్ అడాప్టివ్ స్క్రీన్ ప్లే: గంగూభాయ్ కఠియవాడి, బెస్ట్ డైలాగ్ రైటర్ - గంగూభాయ్ కఠియవాడి, బెస్ట్ సినిమాటోగ్రఫీ - అవిక్ ఉపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్), బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ - శ్రేయా ఘోషాల్ (ఇరవిన్ నిజాల్.. మాయావా చయావా), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - భవిన్ రబారీ (చెల్లో షో), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - పల్లవి జోషీ (కశ్మీర్ ఫైల్స్), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ - మిమి (హిందీ), బెస్ట్ నటి - అలియా భట్, కృతిసనన్ వంటి వారికి అవార్డులు లభించాయి.

ఇక అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించడంతో ఇప్పటికే అల్లు వారి ఇంట సంబరాలు మొదలు అయ్యాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X