69th National Film Awards: జాతీయ అవార్డులు పొందిన వారికి నగదు బహుమతి ఎంత ఇస్తారో తెలుసా?
జాతీయ చలనచిత్ర అవార్డులను గెలిచిన విజేతలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24న సాయంత్రం లాంఛనంగా దిల్లీలో ప్రకటించింది. 2021కు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా అనేక విభాగాల్లో అవార్డు విజేతలను వెల్లడించింది. దేశంలో చలన చిత్రాలకు నేషనల్ ఫిల్మ్ అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే ఈ అవార్డుల్లో విజేతలకు ఎంత నగదు బహుమతి ఇస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. I&B అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, 28 భాషల్లో మొత్తం 280 చలనచిత్రాలు , 23 భాషలలో 158 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. ఇక వీరికి స్వర్ణ కమలం, రజత కమలం కింద ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ వివరాల్లోకి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జాతీయ అవార్డుల విజేతలు వీరే.. వారికి వచ్చే నగదు బహుమతి వివరాలు...
⦁ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ) - స్వర్ణకమలం( దర్శక నిర్మాతలకు కలిపి రూ.2 లక్షల 50వేలు నగదు)
⦁ ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ) - స్వర్ణకమలం( దర్శక నిర్మాతలకు కలిపి రూ.2 లక్షల 50వేలు నగదు)
⦁ ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (ఆర్‌ఆర్‌ఆర్) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్: సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ) - రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్: సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ) -- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్ (ఇరివిన్ నిజాల్ - మాయావా ఛాయావా)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్- కొమురం భీముడో)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛల్లో షో-గుజరాతీ)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్‌ఆర్‌ఆర్ (రాజమౌళి)- స్వర్ణకమలం( దర్శక నిర్మాతలకు కలిపి రూ.2 లక్షల 50వేలు నగదు)
⦁ ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ మేకప్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కాఠియావాడి)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ (సర్దార్ ఉద్దమ్)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉద్దమ్ (దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమస్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస మోహన్ (ఆర్‌ఆర్ఆర్)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనింగ్): అనీష్ బసు (చైవిట్టు-మలమాళం)- రజత్ కమలం (రూ.50వేల నగదు)
⦁ ఉత్తమ ఆడియోగ్రఫీ (రీరికార్డింగ్): సినోయ్ జోసెఫ్ (ఝిల్లి డిస్కర్డ్స్- బెంగాలీ)- రజత్ కమలం (రూ.50వేల నగదు)


Click it and Unblock the Notifications











