69th National Film Awards: సుక్కును పట్టుకుని ఏడ్చేసిన బన్నీ... వీడియో వైరల్

మెగా కాంపౌండ్ నుంచి ఓ కుర్రాడు గంగోత్రి అంటూ అడుగుపెట్టి... ఇప్పుడు తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డును సైతం సాధించి.. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ఇక ఆగస్టు 24వ తేదీన నేషనల్ అవార్డ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఉత్తమ నటుడిగా బన్నీ ఎంపిక అయ్యారు. ఈ విషయం తెలియగానే బన్నీ ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...

డాడీ సినిమాలో గోపి అనే క్యారెక్టర్ చేసి.. గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ను చూసి.. ఇతను హీరో ఎంట్రా అంటూ కామెంట్స్ వచ్చాయి. ఆయన లుక్స్ పరంగా ఇంకా చిన్నా పిల్లాడు... డబ్బులు ఉంటే హీరో అయిపోరు అంటూ కొంత మంది విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నీంటికి చెక్ పెడుతూ.. బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఆర్యగా కం బ్యాక్ ఇచ్చారు.

69th National Film Awards: Pushpa Movie Director Sukumar and Allu Arjun gets Emotional Video Viral

ఇక ఆర్య సినిమాలో బన్నీ చూసి... విమర్శించిన వారే ప్రశంసించారు. లుక్స్ మీద కామెంట్స్ చేసిన వారంతా.. స్టైల్ అంటే ఇదిరా అని చూపించి స్టైలిష్ స్టార్ అయ్యారు. ఇక సినిమా సినిమాకు మరింత క్రేజ్ సాధిస్తూ.. 2021 లో చేసిన పుష్ప సినిమాతో ఐకానిక్ స్టార్ అయిపోయారు బన్నీ. ఈ సినిమా బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చింది.

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన చిత్రం పుష్ప. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించగా... దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీని సాధించుకుంది. ఇక ఈ చిత్రంలో బన్నీ మేనరిజమ్స్, స్టైల్ ను ప్రముఖులు సైతం ఫాలో అయ్యారు.

69th National Film Awards: Pushpa Movie Director Sukumar and Allu Arjun gets Emotional Video Viral

69 ఏళ్లలో ఏ తెలుగు హీరో తీసుకురాలేని అరుదైన గౌరవాన్ని బన్నీ తీసుకొచ్చారు. 69వ నేషనల్ అవార్డ్ ను బన్నీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక విషయం తెలియడంతో అల్లు అరవింద్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. పుష్ప సినిమా నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ ను కలిసి ఆయనకు స్వయంగా విషెస్ తెలిపారు.

ఇక తనకు పుష్ప లాంటి సినిమాను అందించిన సుకుమార్ ను పట్టుకొని బన్నీ ఎమోషనల్ అయ్యారు. గట్టిగా కౌగిలించుకొని సుకుమార్, బన్నీ ఏడ్చేశారు. అందుకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. 69 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక వీడియోలో అల్లు అరవింద్, అల్లు స్నేహ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X