69th National Film Awards RRR: సిక్సర్ కొట్టిన ఆర్ఆర్ఆర్... ఆ మరక చెరిగిపోయింది!

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు అవార్డుల పంట పండింది. 69వ జాతీయ అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24 వ తేదీన సాయంత్రం ప్రకటించింది. 2021కు గాను ఈ సినిమాకు ఆరు అవార్డులు లభించాయి. ఒక తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు రావడం గర్వనీయం. ఇప్పటికే అస్కార్ అవార్డు కొట్టేసిన ఈ చిత్రం... ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ తన సత్తా చూపించింది. ఇక ఏ కేటగిరీలో ఏ అవార్డు లభించిందో.. ఆ వివరాల్లోకి వెళితే....

ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి సత్తా చూపించింది. తెలుగు వాడు గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా హలీవుడ్ గడ్డపై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిచింది. ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా హవా చూపించింది. ఆగస్టు 24 వ తేదీన సాయంత్రం 69వ జాతీయ అవార్డుల విజేతలను (69th National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు కొట్టేసింది.

69th National Film Awards : SS Rajamouli RRR Won 6 Awards and Full Details Here

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఈ చిత్రంలో అల్లురి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీముడిగా ఎన్టీఆర్ నటించారు. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించగా... బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అంతే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది.

69వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రటించగా... అందులో ఆర్ఆర్ఆర్ సినిమా ఆరు అవార్డులు సాధించింది. 6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది త్రిబుల్ ఆర్. ఇక బెస్ట్ పాపులర్ మూవీ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్), బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - కాలభైరవ (ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో పాట), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ - కింగ్ సోలోమాన్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - వీ శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) అవార్డులు వచ్చాయి.

ఒకప్పుడు రాజమౌళి చిత్రాలు అంటే.. కేవలం కాసుల వర్షం కురిపిస్తాయని అంటుండే వారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ మరక చెరిగిపోయిందని అర్ధం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మరో ఆరు అవార్డులు వచ్చాయి. దీనితో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సిక్సర్ కొట్టి.. ఆ మరకను చెరపేసిందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X