twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    7 Days 6 Nights Trailer Review.. ఎంఎస్ రాజు యూత్‌పుల్ ఎంటర్‌టైనర్.. ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

    |

    ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీకి అందించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు, దర్శకునిగా 'డర్టీ హరి' విజయం తర్వాత రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ '7 డేస్ 6 నైట్స్'కి రూపకల్పన చేశారు. సంక్రాంతి బరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే... 'లెట్ మి గో దేర్' సాంగ్ విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజా ట్రైలర్ విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుత స్పందన లభిస్తోంది. సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్టు ఎంఎస్ రాజు తెలిపారు.

    7 Days 6 Nights Trailer Review.. MS Raju strikes again with youthful entertainer

    '7 డేస్ 6 నైట్స్'లో సుమంత్ అశ్విన్ హీరో. ఆయన సరసన మెహర్ చాహల్ నటించారు. రోహన్, క్రితికా శెట్టి మరో జంటగా నటించారు. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. ఈ సినిమా మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందింది. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

    7 Days 6 Nights Trailer Review

    నిర్మాతల్లో ఒకరైన సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ "ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లిన‌ ఇద్దరు యువకుల కథే '7 డేస్ 6 నైట్స్'. టైటిల్ చూసి హారర్ చిత్రమో, మరొకటో అనుకోవద్దు. ఇదొక కూల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. టూర్‌లో జ‌రిగిన‌ సంఘటనలను మా నాన్నగారైన దర్శకుడు ఎంఎస్ రాజు అందంగా చిత్రీకటించారు. ఇద్దరు యువకులుగా నేను (సుమంత్ అశ్విన్), రోహన్ (తొలి పరిచయం) నటించాం. మెహర్ చాహల్, క్రితికా శెట్టిలను కథానాయికలుగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాలో వండర్ ఫుల్ విజువల్స్, రొమాన్స్ తో పాటు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ హైలైట్ అవుతాయి. నా కెరీర్‌లో ఈ సినిమాలోని క్యారెక్టర్ బెస్ట్ క్యారెక్ట‌ర్‌గా నిలుస్తుంది. నాతో పాటు తొటి నటీనటుల పాత్రలు హైలైట్ అవుతాయి" అని అన్నారు.

    సహ నిర్మాత జె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ "మా దర్శకుడు ఎంఎస్ రాజు గారు నుంచి వచ్చే మరో క్లాసిక్ '7 డేస్ 6 నైట్స్'. ఇదొక లైట్ హార్టెడ్ కామెడీ. యువతీ యువకులకు గిలిగింతలు పెట్టే చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి అత్యంత అద్భుతమైన పనితీరు కబరిచారు. ఈ సినిమాతో మెగా మేకర్ ఎంఎస్ రాజుగారు పదహారేళ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్స్‌లో ఉంటోంది. జునైద్ సిద్ధికీ అందంగా ఎడిటింగ్ చేశారు" అని చెప్పారు.

    '7 డేస్ 6 నైట్స్'లో నటులు, సాంకేతిక నిపుణులు
    నటీనటులు: సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి, సుష్మ, రిషికా బాలి తదితరులతో పాటు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ తదితరులు
    సంగీతం: సమర్థ్ గొల్లపూడి
    సినిమాటోగ్రఫి: నాని చమిడిశెట్టి
    ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
    ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
    స్టిల్స్: ఎం రిషితా దేవి
    పీఆర్వో: పులగం చిన్నారాయణ
    డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు
    పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే
    కో-డైరెక్టర్: యువి సుష్మ
    స్పెషల్ పార్టనర్: రఘురాం టి
    కో-ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము
    నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్
    నిర్మాణ సంస్థలు: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ & ఎబిజి క్రియేషన్స్
    సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
    రచన - దర్శకత్వం: ఎంఎస్ రాజు

    English summary
    7 Days 6 Nights Trailer Review.. MS Raju strikes again with youthful entertainer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X