70th Filmfare Awards South 2026: ఫిల్మ్‌ఫేర్‌లో అల్లు అర్జున్ ‘పుష్ప 2' హవా.. విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

70th Filmfare Awards South 2026: 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2026 వేడుక కేరళలోని కొచ్చి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక టాలీవుడ్‌కు ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2024లో విడుదలైన సినిమా నుంచి ఉత్తమ ప్రతిభను ఎంపిక చేసి అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో పుష్ప 2 ( Pushpa 2: The Rule) అత్యధిక విభాగాల్లో విజయం సాధించింది. పుష్ప రాజు మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి తన స్టార్డమ్‌ను నిరూపించుకున్నారు.

అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్... ఏడో ఫిల్మ్‌ఫేర్
'పుష్ప 2'లో పుష్పరాజ్ పాత్రకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో ఆయన కెరీర్‌లో ఏడో ఫిల్మ్‌ఫేర్ అవార్డును ఖాతాలో వేసుకున్నారు. గతంలో పరుగు, వేదం, రేసుగుర్రం (క్రిటిక్స్), రుద్రమదేవి (సపోర్టింగ్ యాక్టర్), సరైనోడు, పుష్ప 1 సినిమాలకు గాను ఫిల్మ్‌ఫేర్‌లు అందుకున్న అల్లు అర్జున్... ఇప్పుడు 'పుష్ప 2'తో మరో మైలురాయిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

70th Filmfare Awards South 2026 Winners Pushpa 2 Dominates Allu Arjun Wins Best Actor

'పుష్ప 2' హవా
ఉత్తమ సినిమాగా పుష్ప 2 (Pushpa 2: The Rule)ఎంపిక కాగా, ఆ సినిమా దర్శకుడు సుకుమార్ (Sukumar)కు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. అలాగే ఈ సినిమాకి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును అందుకున్నారు. టెక్నికల్ విభాగాల్లోనూ 'పుష్ప 2' మెరిసి, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు కూడా ఈ సినిమాకే వరించింది.

నివేదా థామస్‌కు బెస్ట్ హీరోయిన్
నివేదా థామస్.. 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu) సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఆమె సహజమైన పర్ఫార్మెన్స్‌పై జ్యూరీ ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ఉత్తమ సహాయ నటుడిగా లెజెండరీ స్టార్ అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD) అవార్డు అందుకోగా, ఉత్తమ సహాయ నటిగా అంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)ఎంపికయ్యారు. ఇక క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా తేజ సజ్జా (హను మాన్) గెలుచుకోగా, ఉత్తమ నటిగా కాజల్ అగర్వాల్‌ (సత్యభామ) నిలిచారు.

'కుర్చీ మడతపెట్టి' పాటకు డబుల్ హిట్
గుంటూరు కారం (Guntur Kaaram)లోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) గా శ్రీకృష్ణ (Sri Krishna), బెస్ట్ కొరియోగ్రఫీగా శేఖర్ మాస్టర్ (Shekhar Master) అవార్డులు అందుకున్నారు. అలాగే దేవర ('Devara: Part 1)లోని 'చుట్టమల్లె' పాటకు బెస్ట్ లిరిక్స్‌గా రామజోగయ్య శాస్త్రి , బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా శిల్ప రావు గెలుపొందారు.

కొత్త ప్రతిభకు గుర్తింపు
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యాదు వంశీ ( కమిటీ కుర్రాళ్లు) డెబ్యూ మేల్‌గా సందీప్ సరోజ్ (Sandeep Saroj), డెబ్యూ ఫిమేల్‌గా నయాన్ సారిక (Gam Gam Ganesha) అవార్డులు అందుకున్నారు. ఇలా ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ వేదికపై టాలీవుడ్ నుంచి 'పుష్ప 2' వరుస అవార్డులు అందుకుంది. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2026 టాలీవుడ్ టాలెంట్‌కు జాతీయ స్థాయిలో మరోసారి ఘన గుర్తింపు నిచ్చిన వేడుకగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X