72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే?

72nd National Film Awards: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (72nd National Film Awards)లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. శనివారం సాయంత్రం అధికారికంగా ఈ అవార్డులను ప్రకటించారు. కాగా 2024లో జనవరి నుంచి డిసెంబర్ దాకా సెన్సార్ అయిన సినిమాలను పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించారు.

ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన సినిమాలను ఎంపిక చేశారు. ఇందులో ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాలలో నటన, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇతర సాంకేతిక విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి అవార్డులు ప్రకటించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలు పోటీ పడ్డాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా వివిధ కేటగిరీల్లో పురస్కారాలు ఎవరికి లభించాయటంటే?

72nd National Film Awards Winners 2026

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు మరోసారి తమ సత్తా చాటాయి. ఈసారి టాలీవుడ్ సినిమాలు తొమ్మిది విభాగాల్లో జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నాయి. 'కల్కి 2898 ఏడీ' ఉత్తమ ప్రజాదరణ (Wholesome Entertainment) సినిమాగా ఎంపిక కాగా, అదే సినిమాకి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా అవార్డు అందుకున్నారు. ఇక '35: ఇది చిన్న కథ కాదు' ఉత్తమ బాలల సినిమాగా ఎంపిక కాగా, అదే సినిమాలో నటించిన అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా నిలిచారు.

'లక్కీ భాస్కర్' సినిమాకు వెంకీ అట్లూరి ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డు అందుకున్నారు. అలాగే 'పుష్ప 2' సినిమా కూడా సత్తా చాటింది. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే సుకుమార్ , ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా దీపాలి నూర్-శీతల్ శర్మ (పుష్ప 2)ఎంపికయ్యారు. ఇక కొణిదెల నిహారిక 'కమిటీ కుర్రాళ్లు' ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు అందుకోగా, అదే చిత్రానికి పీ. రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. మొత్తం మీద తెలుగు చిత్రాలు తొమ్మిది విభాగాల్లో అవార్డులు గెలిచింది.

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల పూర్తి జాబితా

ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (చందు ఛాంపియన్), మమ్ముట్టి (భ్రమయుగం) - ఇద్దరూ సంయుక్తంగా అవార్డు అందుకున్నారు.
ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370
ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్)
ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)

ఉత్తమ సహాయ నటి: రూపశ్రీ వర్కాడి (మిథ్య), సచన నమిదాస్ (మహారాజా) -సంయుక్తంగా
ఉత్తమ సంగీత దర్శకుడు: శాశ్వత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ నేపథ్య సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: పీ. రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)

ఉత్తమ మహిళా గాయని: వైకం విజయలక్ష్మి (ఏఆర్ఎమ్)
ఉత్తమ పురుష గాయకుడు: అభయ్ జోధ్ (నవసచి గౌరి మాజీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: దీపాళి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ బాలల చిత్రం: 35 - ఇది చిన్న కథ కాదు
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి ( కల్కి 2898 AD)

ఉత్తమ ఎడిటింగ్: ఆర్. కలైవన్నన్ (అమరన్)
ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి ( భూల్ భులయ్యా 3)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (డైలాగ్స్): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: యోగేశ్ దేశ్‌పాండే
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సుకుమార్ (పుష్ప 2)

ఉత్తమ బాల నటీనటులు: రిధిమన్ బెనర్జీ, తపమోయ్ దేబ్, గీతాశ్రీ చక్రబర్తి, అరుణ్ దేవ్ (35 - ఇది చిన్న కథ కాదు), అతీశ్ శెట్టి (మిథ్య)

బెస్ట్ నేషనల్‌, సోషల్‌, ఎన్విరామెంటల్‌ వాల్యూస్‌ ఫిల్మ్‌: కెప్టెన్‌ మిల్లర్‌ (అరుణ్‌ మాథేశ్వరన్‌)
అత్యధిక హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం: కల్కి 2898 AD
ఉత్తమ తొలి దర్శకుడు: రణ్‌దీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్)
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రం: రాయన్
ఉత్తమ ప్రాంతీయ మలయాళ చిత్రం: ఫెమించి ఫాతిమా
ఉత్తమ ప్రాంతీయ కన్నడ చిత్రం: మిథ్య
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: అనల్ అరసు (మహారాజా)

Read more about: national film awards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X