‘ఆ కులం వాళ్లతోనే ఎందుకు రేప్ చేయించారు? పవిత్ర కాశీలో కబేళాలా?’
తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇటీవల వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రం ఏకంగా ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లాంటి స్టార్స్ నటించిన చిత్రంతో పోటీగా విడుదల అవ్వడం విశేషం. జూన్ 20న ఈ రెండు చిత్రాలు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యాయి. ఇక కుబేరా కాసుల వర్షం కురిపిస్తుండగా 8 వసంతాలు చిత్రం ప్రేక్షకుల మద్దతుతో థియేటర్లలో రన్ అవుతోంది. బాక్సాఫీస్ వసూళ్లు కూడా మాదిరిగా ఉన్నాయి. అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత వివాదంలో చిక్కుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని రేప్ సీన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
8 వసంతాలు చిత్రం విశేషాలు..
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా అనంతిక సనిల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీగా విశ్వనాథ్ రెడ్డి పనిచేశారు. శశాంక్ మాలి ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

అసలు వివాదం ఏంటీ?
ఊటీలో సాగే ప్రేమ కథా చిత్రమిది. ఒక యువతి, ఇద్దరు కుర్రాళ్ మధ్య కథ మొత్తం సాగుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అంనతిక సనీల్ కుమార్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొత్త రకం సినిమాకు చూపించే ప్రయత్నం చేశారని అభినందనలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో చిత్రంలోని వారణాసి ఎపిసోడ్ పై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్ లో కబేళాలపై పండితులు, ముస్లింలు కలిపి రేప్ చేసినట్టుగా చూపించారని మండిపడుతున్నారు.
అయితే కేవలం పండింతులు, బ్రాహ్మణలను టార్గెట్ చేస్తూ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టుగా అనిపిస్తోందని సినీ ప్రముఖులు అంటున్నారు. అయితే ఎందుకని ప్రత్యేకించి ఆ సీన్ లో బ్రాహ్మణులను తప్పు చేసే వారిగా చూపించారని.. ఇంక ఇతర కులాల వారినీ చూపించొచ్చు కదా అని ప్రశ్నించారు. దానికి చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక దర్శకుడు ఫణీంద్ర దీనిపై వివరణ ఇవ్వాలని అంటున్నారు. ఇక ఆయన ఎలా స్పందిస్తారో తెలియాలి.
సరైన కథలు పడితే స్టార్ హీరోయినే..
8 వసంతాలు చిత్రంలో ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది మాత్రం అనంతికా సనీల్ కుమార్. ఈమె కేరళలో పట్టి పెరిగింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ నటిగా అవకాశాలు అందుకుంది. 2015లోనే మిలి అనే తమిళ చిత్రంలో నటించింది. అలాగే రైడ్, లాల్ సలామ్, తెలుగు లో మ్యాడ్, రాజమండ్రి రోజ్ మిల్క్ లాంటి సినిమాలు చేసింది. ఇక అనంతికా సనీల్ కుమార్ మల్టీ టాలెంటెడ్ కావడంతో ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. క్లాసికల్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, కరాటే, కళరియాపట్టు, డ్రామ్స్ ప్లేయర్, న్యాయ విద్యార్థి కావడం విశేషం. ఇక ప్రస్తుతం ఆమె 19 ఏళ్లే. 8 వసంతాలు చిత్రంలో మల్టీ టాలెంట్స్ చూపించి, నటనలోనూ అద్భుతమనిపించింది.


Click it and Unblock the Notifications











