800 Movie Trailer Review గుండెను పిండేసేలా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్..లెగ్ స్పిన్నర్‌కు అలాంటి అవమానాలు!
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లకు మైదానంలో చెమటలు పట్టించిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ ఒకరంటే ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. లెగ్ స్పినర్‌గా ముత్తయ్య విసిరిన బాల్స్‌కు మేటి బ్యాట్స్‌మెన్లందరూ మోకరిల్లారు. దాంతో 800 వికెట్లును తన ఖాతాలో వేసుకొన్నాడు.
ఈ మిలియనీయంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచిన ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని ఎన్నో సమస్యలు, మరెన్నో చేదు అనుభవాలు, అనేక వివాదాలు వెంటాడాయి. మనకు తెలిసిన క్రికెటర్ జీవితంలో కనపించని కోణాన్ని దర్శకుడు ఎంఎస్ శ్రీపతి బయటకు తీసే ప్రయత్నంలో 800 చిత్రాన్ని ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా ప్రేక్షకుల ముందుకు ఉంచబోతున్నాడు. ఎమోషనల్ బయోపిక్‌గా కనిపిస్తున్న 800 మూవీ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..

శ్రీలంక లెగ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాను ఎంఎస్ శ్రీపతి తెరకెక్కిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ పాత్రను స్లమ్ డాగ్ మిలియనర్ ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య పాత్రను ముధిమలార్ రామస్వామి పోషిస్తున్నారు. ఈ సినిమాకు బుకర్ ప్రైజ్ విన్నర్ స్నేహన్ కరుణాతిలక రైటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన 800 సినిమాను ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పాన్ ఇండియా డిస్టిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకొన్నాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను తమిళం భాషలో నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు.
శ్రీలంకలో పౌరసత్వం లేకుండా బానిసలుగా బతకడానికి వచ్చిన వారికి చాలా కష్టం అంటూ నాజర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ చాలా ఎమోషనల్‌గా ప్రారంభమైంది. శ్రీలంకలో ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం జరిగిన మారణహోమం, బాంబు పేలుళ్ల సంఘటనలను చాలా ఉద్వేగంగా తెరకెక్కించినట్టు ట్రైలర్‌లో కనిపించింది. ఈ రోజు దేశం తిరిగి చూసేలా ఓ పేదవాడు గొప్పవాడు అయ్యాడు. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ అంటూ ప్రశంసలు అందుకోనే సీన్ అద్బుతంగా కనిపించింది. ట్రైలర్‌లో అర్జున రణతుంగ, షేర్ వార్న్ లాంటి గొప్ప క్రికెటర్లు కనిపించారు.

ముత్తయ మురళీధరన్ విసిరిన బాల్‌కు తిరుగులేని పరిస్థితుల్లో చెకింగ్ ఆరోపణలు రావడంతో లెగ్ స్పిన్నర్ క్రీడా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి సమయంలో ఆస్ట్రేలియా ఆరోపణలకు క్రికెట్ నిపుణుల ముందు అగ్ని పరీక్షకు సిద్దమవ్వడం క్రీడా రంగంలో ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు. నీకు తమిళం మాట్లాడటం వచ్చా? కొందరు అవమానించడం ట్రైలర్‌లో ఎమోషనల్‌గా ఉంది.
ఇక 800 మూవీ ట్రైలర్‌లో ఎల్‌టీటీఈ సభ్యులు, ప్రభాకరన్‌తో ముత్తయ్య మురళీధరన్ మాటలు చాలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీలంకకు వెళ్లిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) శ్రీలంకలోని తమిళులపై చేసిన అరాచకాలను కూడా ఈ కథలో భావోద్వేగంతో చర్చించినట్టు కనిపించింది. శ్రీలంకలో క్రికెటర్లు ప్రయాణించే బస్‌పై ఉగ్రవాదుల కాల్పులు, క్రీడా రాజకీయాలను చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారు.
ఇదిలా ఉంటే.. శ్రీలంక జట్టులో తమిళలకు చోటు లేదనే వాదనకు ముత్తయ్య మురళీధరన్ తన తండ్రికి ఇచ్చిన జవాబు గుండెను పిండేసేలా ఉంది. జట్టులో తమిళులకు చోటు ఉండుదుగా.. అని తండ్రి అంటే.. నేను ఒక తమిళవాడిగా నేను భావించడం లేదు అని ముత్తయ్య అంటే.. నీవు సింహళీయుడివా అంటే.. లేదు..నేను క్రికెటర్‌ను అంటూ సమాధానం చెప్పడం 800 మూవీ ఎలా ఉండబోతుందోననే విషయం స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.
నటీనటులు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్, నాజర్, వెల్ రామ్మూర్తి, రిత్విక, అరుల్ దాస్, హరికృష్ణన్, శరత్ లోహియా తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
మ్యూజిక్: జిబ్రాన్
రచన, దర్శకత్వం: ఎంఎస్ శ్రీపతి


Click it and Unblock the Notifications











