#90s డైరెక్టర్‌కు బంపరాఫర్.. ఏకంగా ఆ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శివాజి, వాసుకిల కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ హిట్టు వెబ్ సిరీస్ #90s గురించి అందరికీ తెలిసిందే. అయితే మిడిల్ క్లాస్ కథలను చక్కగా కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ వెబ్ సిరీస్ ను అంతా తెగ ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్ ను చూస్తూనే ఉన్నారు. 90స్ వాళ్లకు తమ బాల్య స్మృతులను గుర్తు చేసిన ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్.. బంపరాఫర్ కొట్టేశారు. ఓ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. అయితే ఆ హీరో ఎవరు, ఆయన కొట్టేసిన సూపర్ ఛాన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
#90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఒక్క వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సక్సెస్ ను ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉండగానే.. మరో రెండు ప్రాజెక్టులు ఆయన వద్దకు చేరాయి. ముఖ్యంగా రెండు పెద్ద సినిమా అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ అండ్ డైనమిక్ హీరో నితిన్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఈ యంగ్ డైరెక్టర్ అందుకున్నట్లు సమాచారం. అయితే నితిన్ హీరోగా తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మీద ఒక మూవ చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ సినిమా కోసం కథ కూడా రెడీ అయిపోయిందట.

ఈ సినిమాతో పాటు మరో అద్భుతమైన సినిమాలో కూడా ఈ డైనమిక్ డైరెక్టర్ ఛాన్స్ దక్కించుకున్నాడట. సితార ఎంటర్ టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఒక ప్రాజెక్టు కోసం ఆదిత్య హాసన్ ను లాక్ చేసుకున్నారట. అయితే కథ పూర్తిగా సిద్ధం కాకపోవడం వల్ల హీరోహీరోయిన్లు ఎవరో ఇంకా సెలెక్ట్ చేసుకోలేదట. కానీ కథ పూర్తిగా సిద్ధం అయ్యాక.. దానికి ఎవరు సూట్ అవుతారో వాళ్లను తీసుకు వస్తానని ఆదిత్యకు ప్రొడ్యూసర్ నాగవంశీ హామీ కూడా ఇచ్చారట. ఇలా అద్భుతమైన అవకాశాలను అందుకున్న ఈయన జీవితం ఒక్క వెబ్ సిరీస్ తో మారిపోయింది.
తొలి వెబ్ సిరీస్ తోనే ఇంత మంచి ఛాన్స్ కొట్టేసిన ఈ డైరెక్టర్ కు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది. మామూలుగా హిందీలో పెద్ద పెద్ద వెబ్ సిరీస్ లు చేసి సక్సెస్ సాధించిన వాళ్లకు ఇంలాటి అవకాశాలు రావడం కామన్ యే కానీ.. తెలుగు డైరెక్టర్లకు ఇలాంటి అవకాశాలు రావడం చాలా అరుదనే చెప్పాలి. ఏది ఏమైనా సూపర్ ఆఫర్లు పట్టేసిన ఈ సూపర్ డైరెక్టర్ కు తొలి వెబ్ సిరీస్ లాగే తొలి సినిమాతో సక్సెస్ వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











