టాలీవుడ్‌కు మరో వారసుడు.. ప్రముఖ ఎడిటర్ కుమారుడు హీరోగా నేనెవరు.. ఫస్ట్‌లుక్ రిలీజ్
తెలుగు సినిమా పరిశ్రమలో నటుల వారసులే కాకుండా సాంకేతిక విభాగాల్లో పనిచేసే ప్రముఖులు పిల్లలు సిని రంగానికి పరిచయం కావడం సర్వసాధారణమేనన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే తెర వెనుక కీలకంగా వ్యవహరించే సాంకేతిక నిపుణుల వారసులు సినీ రంగానికి పరిచయం అయ్యారు. అదే బాటలో ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో భీమినేని శివప్రసాద్. తన్నీరు రాంబాబు తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న 'నేనెవరు' చిత్రం ద్వారా కోలా బాలకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా పూనమ్ చంద్, కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి వ్యవహరిస్తున్నారు.

కోలా బాలకృష్ణకు జంటగా సాక్షి చౌదరి నటిస్తున్న ఈ చిత్రంలో తనిష్క్ రాజన్-గీత్ షా, బాహుబలి ప్రభాకర్ విలన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను జనవరి 29వ తేదీన విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ... కోలా భాస్కర్ ఎడిటింగ్ చేసిన చివరి చిత్రమిది. త్వరలో టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని భావోద్వేగానికి గురయ్యారు. ఆదిత్య మ్యూజిక్ ఆడియో హక్కులు సొంతం చేసుకున్నది.

సాంకేతిక వర్గం:
కెమెరా: సామల భాస్కర్
ఫైట్స్: రియల్ సతీష్
పిఆర్వో: ధీరజ్ అప్పాజీ
పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్,
పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్
ఎడిటింగ్: కోలా భాస్కర్
సంగీతం: ఆర్ జి సారథి
సహ నిర్మాతలు: పూనమ్ చంద్ కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి
నిర్మాతలు: భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు
దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి


Click it and Unblock the Notifications











