నాకు జక్కన్న అలాంటి టార్చర్.. సెల్ఫీ వీడియోతో రాజమౌళి ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్!
తెలుగు సినిమా ఖ్యాతిని ఓ రేంజ్ లో నిలబెట్టిన ప్రెజెంట్ జెనరేషన్ వన్ అండ్ ఓన్లీ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పవచ్చు. కాగా ఒకో సినిమాతో భారీ లెవెల్లో గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళుతున్న జక్కన్న ఇపుడు చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ వరల్డ్ లెవెల్లోనే వెనళ్లనున్నాయి. కాగా ఇంతలా పేరు తెచ్చుకున్న రాజమౌళి విషయంలో మాత్రం కాంట్రావర్సీలు చాలా తక్కువే ఉంటాయని చెప్పవచ్చు.
ఏవో సినిమాల పరంగా పలు అంశాల్లో కాంట్రవర్సీలు ఒకటీ రెండు తాను ఫేస్ చేసి ఉండొచ్చు కానీ జక్కన్నపై స్వయంగా మాత్రం దాదాపు లేవనే చెప్పవచ్చు. కానీ లేటెస్ట్ గా మాత్రం ఒక షాకింగ్ ఇష్యూలో జక్కన్న ఇరుక్కోవడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా రాజమౌళి ఇపుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉంటే ఈ గ్యాప్ లోనే తన స్నేహితుడు షాకిచ్చినట్టుగా తెలుస్తోంది.

రాజమౌళితో ఎప్పటి నుంచో స్నేహ బంధం కొనసాగిస్తున్న యూ. శ్రీనివాసరావు అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేస్తూ జక్కన్నపై ఓ సూసైడ్ వీడియో కూడా వదిలినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు అని అందుకే ఒక లెటర్ మరియు సూసైడ్ చేసుకుంటాను అన్నట్టుగా ఒక సెల్ఫీ వీడియో కూడా తన సన్నిహితులకి ఆయన పంపడం జరిగిందట.
దీనితో అలా ఈ షాకింగ్ అంశం బయటకి పొక్కింది. కాగా ఇంతే కాకుండా ఈ కామెంట్స్ తో రాజమౌళిపై సుమోటు ఆధారంగా కేసు ఫైల్ చెయ్యాలని పోలీసులని కూడా అతను డిమాండ్ చేస్తున్నారట. అయితే అసలు రాజమౌళి తనని టార్చర్ చేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప తాను ఏం చేసారు ఎందుకు అనే కారణాలు మాత్రం ఈయన రివీల్ చేయనట్టుగా తెలుస్తుంది.
పోలీసులకి ఆ విషయాలు చెప్పడం లేదని లేని పక్షం కేసు ఎలా తీసుకుంటారు అనే వెర్షన్ కూడా ఇపుడు వినిపిస్తుంది. కాగా ఇపుడు సోషల్ మీడియాలో అయితే ఆ లెటర్ సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి అంతలా జక్కన్న ఏం చేశారు అనేది కూడా ఒకింత షాకింగ్ గా మారింది.

ఇంకోపక్క ఏం చేసుకున్నా సరే మా మహేష్ బాబుతో సినిమా అయ్యేవరకు ఎవరూ డిస్టబ్ చెయ్యొద్దు అంటూ మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. మామూలుగా రాజమౌళి సినిమాలు పరంగా నటీనటుల్ని ఓ రేంజ్ లో హింసిస్తారు అని స్వయంగా జూనియర్ ఎన్టీఆరే చెప్పాడు కానీ ఇపుడు ఇది కొంచెం సీరియస్ మేటర్ గా కనిపిస్తుంది.
గతంలో ఎప్పుడూ ఈ తరహా ఆరోపణలు రాజమౌళిపై వచ్చింది లేదు. ఫ్యామిలీ పరంగా కూడా ఎప్పుడు రిజర్వ్డ్ గానే జక్కన్న ఉండటం జరిగింది. మరి ప్రస్తుతం ఈ తరహా కాంట్రవర్సీ జరగడం అనేది ఒకింత షాకింగ్ అని చెప్పాలి. మరి దీనిపై తన నుంచి ఏమన్నా క్లారిటీ లాంటిది వస్తుందేమో వేచి చూడవలసిందే.


Click it and Unblock the Notifications











