ప్రశాంత్ నీల్ మెంటల్ మాస్ ప్లానింగ్.. KGF3కి ఆ స్టార్ హీరోతో లింక్?
ఇపుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర పలు క్రేజీ కాంబినేషన్ సినిమాలు ఒకొకటిగా ప్రొడ్యూస్ అవుతున్న వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ ఇండస్ట్రీస్ నుంచి ఆయా దర్శకులు, హీరోలు బాషా భేదం లేకుండా భారీ చిత్రాలు చేస్తూ వస్తున్నారు. అలా ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషన్ ని రేపుతున్న సినిమాలు కొన్ని ఉండగా తెలుగు నుంచి బాహుబలి సినిమా టాలీవుడ్ సినిమా ఫేట్ ని మారిస్తే కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీయఫ్ అనే సినిమా శాండిల్ వుడ్ ఫేట్ ని మార్చివేసింది.
కాగా ఇక్కడ నుంచి కన్నడ సినిమా అలాగే ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు ఓ రేంజ్ లో వినిపించాయి. అయితే నీల్ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు రానుండగా ఈ సినిమాల్లో మళ్ళీ యష్ తోనే సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం కేజీయఫ్ చాప్టర్ 3 కూడా ఉంది. కాగా దీనిని చేసే లోపు అయితే ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మరో క్రేజీ సీక్వెల్ సలార్ 2 అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా నీల్ చేయనున్నాడు.

అయితే ప్రశాంత్ నీల్ తన దగ్గర ఉన్న మాస్ కంటెంట్ కి తగ్గట్టుగానే మాస్ కటౌట్స్ నే పట్టుకుంటున్నాడు. అలా యష్, ప్రభాస్, ఎన్టీఆర్ లతో భారీ లైనప్ ని సెటప్ చేసిన తాను ఇప్పుడు మరో సౌత్ మాస్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి కాదు రెండు ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆ స్టార్ హీరోనే తమిళ బిగ్ స్టార్ అజిత్ కాగా తన తోనే ప్రశాంత్ నీల్ రెండు మాస్ సినిమాలు ప్లాన్ చేసాడట. కాగా ఈ రెండు సినిమాలపై కూడా క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది.
దీనితో ఈ సినిమాల్లో ఒకటి స్టాండలోన్ అంటే అజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం లేని సినిమా ఒకటి ప్లాన్ చేస్తుండగా మరో సినిమా ఏకంగా కేజీఎఫ్ 3 తో లింకప్ అయ్యే సినిమాగా తాను ప్లాన్ చేస్తునట్టుగా వినిపిస్తుంది. ఇది మాత్రం ఒక ఊహించని కాంబినేషన్ అని చెప్పాలి. మాములుగా అజిత్ తో సినిమా అంటేనే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హైప్ ని ఫీలవుతున్నారు. అలాంటి మరో సినిమా కేజీయఫ్ తో లింకప్ అంటే ఇక బాక్సాఫీస్ రికార్డులు గల్లంతే అని చెప్పాల్సిందే.

ప్రస్తుతం అయితే నేషన్ సినిమా అంతా కూడా ఊహించని కాంబినేషన్ కోసమే మాట్లాడుకుంటున్నారు. కాగా ఈ సినిమా అసలు ఎలా సెట్ అయ్యింది అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రశాంత్ నీల్ ఇంకా అజిత్ కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేస్తున్నారు. మరి ఇలా ఏమన్నా సంధి కుదిరిందా అని కూడా అనిపించక మానదు.
మరి ప్రస్తుతానికి నేషన్ వైడ్ గా ట్రెండింగ్ గా ఉన్న ఈ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ ఒక్కటి కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పుడు అజిత్ రెండు సినిమాలు గుడ్ బాడ్ అగ్లీ అలాగే విడా మూయఱచి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ వీలయితే ఈ సినిమాల తర్వాత ఆ రెండు సినిమాలు అజిత్ పట్టాలెకెక్కించనున్నాడట. వాటిలో ఒకటి 2025 లోనే స్టార్ట్ చేసేసి 2026కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని కూడా భోగట్టా.


Click it and Unblock the Notifications











