నందమూరి అభిమానులకు సంక్రాంతి కానుక.. బాబాయ్ లోటు పూడ్చనున్న అబ్బాయ్!
సంక్రాంతి కానుకగా నందమూరి అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు యంగ్ హీరో కళ్యాణ్ రామ్. ఆయన తాజా సినిమా 'ఎంత మంచివాడవురా!' సంక్రాంతి సందర్బంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జోడీగా మెహ్రీన్ నటించింది.
ఉమేష్ గుప్త సమర్పణలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా!' మూవీ తెరకెక్కింది.కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది 17వ సినిమా. చిత్రానికి గోపిసుందర్ సంగీతం బాణీలు కట్టారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్, వీడియోస్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. సినిమా విడుదలకు ఇంకా నెలరోజుల సమయం ఉండటంతో సరికొత్తగా ప్రమోషన్స్ చేయాలని భావిస్తోందట చిత్ర యూనిట్.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ సినిమా రావడంలేదు కాబట్టి.. అదే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమాపై ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఈ మేరకు చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్‌కి కూడా మంచి డిమాండ్ నెలకొందని సమాచారం.
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ వారు దక్కించుకున్నారని తెలిసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కళ్యాణ్ రామ్ సినిమాలకు ఉన్న రెస్పాన్స్ దృష్ట్యా భారీ మొత్తానికి ఈ హక్కులు పొందారని టాక్. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసిన చిత్రయూనిట్.. ఓవర్సీస్‌లో జనవరి 14వ తేదీన ప్రీమియర్స్ పడతాయని తెలిపింది.


Click it and Unblock the Notifications











