రెహమాన్ విడాకుల్లో క్రేజీ ట్విస్ట్ .. ఇదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే..
భారతీయ సంగీత చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఆస్కార్ అవార్డ్ విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కూడా ఒకరు. ఎన్నో ఏళ్ళు నుంచి ఇండియన్ సినిమాని తన సంగీతంతో మరో ప్రపంచానికి తీసుకెళ్లిన ఆయన ఇప్పటికీ కూడా తన మార్క్ డిఫరెంట్ మ్యూజిక్ తో అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన నుంచి ఎప్పుడూ ఊహించని వార్తని వినాల్సి వస్తుంది అని ఎవరూ అనుకుని ఉండరు.
తన భార్య సైరా బానుతో విడాకులు ఇచ్చి అందరికీ షాకిచ్చారు. దీనితో ఒక్కసారిగా తన అభిమానుల అందరి హృదయాలు ముక్కలయ్యాయి. అయితే ఇంట్రెస్టింగ్‌గా ఈ ఇద్దరిపై కూడా ఆటోమాటిక్‌గా ఒక్కొక్కరు ఒకరు నెగిటివ్ అన్నట్టుగా ఎవరొకరిపై అలా పలు కామెంట్స్ అయితే రాక మానలేదు.

ఈ క్రమంలో రెహమాన్ విడాకుల తర్వాత ఎంతో బాధపడుతూ తన బాధని వెళ్లగక్కితే ఆ సమయంలో చాలా మంది తనకి విడాకులు ఇష్టం లేదు, తన భార్య మూలానే విడాకులు తీస్కున్నారేమో అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత సైరా బాను ఏమో రెహమాన్‌ని ఎవరైనా ఏమైనా అంటే బాగోదు ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇంకా కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయి.
ఇలా ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్‌గా ఉన్నారు అనేది మరింత సస్పెన్స్ కి దారి తీయగా ఇపుడు ఇంకో క్రేజీ ట్విస్ట్ బయటకి వచ్చింది. వీరి కేసు వాదిస్తున్న మహిళా న్యాయవాది వందన షాహ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెహమాన్ దంపతులు మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ ఉందని ఆమె ట్విస్ట్ ఇచ్చారు.
వీరిద్దరూ ఇక ఎప్పటికీ కలవరు అందుకు అవకాశం లేదు అని నేనెక్కడా చెప్పలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీనితో ఈమె కామెంట్స్ ఇపుడు రెహమాన్ అభిమానుల్లో కొత్త అసలు రేకెత్తించాయి అని చెప్పాలి. దాదాపు 29 ఏళ్ళు కలిసి ఉండి 30 ఏళ్ళు పూర్తి కాకుండానే రెహమాన్ దంపతులు విడిపోవడం చాలా మందిని మరింత బాధ పెట్టింది.

కానీ ఇపుడు లాయర్ చేసిన కొత్త కామెంట్స్‌తో కొంచెం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే కానీ నిజం అయ్యి వారిద్దరూ కలిస్తే రెహమాన్ ఫ్యాన్స్‌కి పండుగే అని చెప్పాలి. ఎలాగో ఇద్దరి నడుమ విడాకులకు అసలు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలీదు. అది వారి నడుమే ఉంది కాబట్టి మళ్ళీ ఆ గొడవలు ఏదో సర్దుకొని కలిసిపోవాలని చాలా మంది ఆశిస్తున్నారు.
చూడాలి వీరి మేటర్ ఎలా సెట్ అవుతుందో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే రెహమాన్ తెలుగు సహా తమిళ్ లో పలు భారీ సినిమాలు చేస్తుండగా .. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానాలతో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ రెండు పాటలు కూడా కంప్లీట్ అయ్యినట్టుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











