Mahesh Babu: ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే.. మహేష్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదట?
చాలా మంది నమ్మినా నమ్మకపోయినా కూడా తెలుగులో పలు సెంటిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి అవి సినిమా టైటిల్స్ నుంచి సినిమా పలు కాంబినేషన్ లు వాటి తర్వాత సినిమాలు ఇలా పలు అంశాలలో సెంటిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కాగా తెలుగులో ఉన్నటువంటి పలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయిక కూడా ఒకటి.
కాగా వీరి నుంచి వచ్చిన మూడు సినిమాలు కూడా థియేటర్స్ లో అంతగా రాణించకపోయినప్పటికీ అవి ఆడియో పరంగా కానీ స్మాల్ స్క్రీన్ పై హిట్ అయ్యాయి. ఇక మరో పక్క తెలుగు సినిమాలో ఇంకో టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో వర్క్ చేసిన హీరోలు తమ నెక్స్ట్ సినిమాగా డిజాస్టర్ నే అందుకుంటారు అనే మిత్ కూడా ఉంది.

మరి ఇదే రాజమౌళితో ఇపుడు మహేష్ బాబు సినిమా చేస్తుండగా వీరిపై వచ్చిన ఓ సోషల్ మీడియా పోస్ట్ సెన్సేషన్ గా మారింది. అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ పై గురూజీ త్రివిక్రమ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఉందని ఆల్రెడీ కామెంట్స్ మొదలయ్యాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ తో వర్క్ చేసిన మూడు సినిమాల్లో మొదటి రెండు సినిమాలు చూసుకున్నటైతే..
మొదట చేసిన "అతడు" ఆ తర్వాత వచ్చిన "పోకిరి" సినిమా కట్ చేస్తే సౌత్ లో ఇండస్ట్రీ హిట్ అయ్యి కూర్చుంది. ఇక అతడు తర్వాత మళ్ళీ చేసిన సినిమా "ఖలేజా". ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేసిన "దూకుడు". ఇది కూడా అప్పట్లో టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ గ్రాసర్ సినిమాల్లో ఒకటిగా నిలిచి సంచలనం సెట్ చేసింది. ఇలా త్రివిక్రమ్ తర్వాత మహేష్ చేసిన అన్ని సినిమాలు కూడా అయితే ఇండస్ట్రీ హిట్టే అయ్యాయి.

ఇక ఇపుడు మళ్ళీ మూడోసారి "గుంటూరు కారం" చేశారు. ఈ సినిమా తర్వాత వస్తున్న సినిమానే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో చేస్తున్న సినిమా. ఇక దీనిపై ఉన్న హైప్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.. ఆల్రెడీ ఇన్ని వేల కోట్లు వసూళ్లు గ్యారెంటీ అనే మార్క్ ఉండకనే ఉంది. సో ఈ సినిమా ఎక్కడ ఆగుతుంది అనేదే అసలు ప్రశ్న.
ఇలా మొత్తానికి మాత్రం త్రివిక్రమ్ తో చేసిన తర్వాత మహేష్ బాబు నుంచి ఇండస్ట్రీలు షేక్ అయ్యే సినిమాలు ఈసారి గ్లోబల్ వైడ్ తన రీచ్ వెళ్లబోతుంది అని చెప్పాల్సిందే. సో మొహమాటమే లేకుండా మహేష్ బాబు కొట్టే దెబ్బకి ఈసారి గ్లోబల్ బాక్సాఫీస్ దిమ్మ తిరిగిపోవాల్సిందే అని చెప్పడంలో సందేహమే లేదు. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో ప్రియాంక చోప్రా జోన్స్ దాదాపు ఖరారు కాగా ఈ సినిమాని సుమారు 1000 కోట్లకి పైగా బడ్జెట్ తో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











