ఆర్జీవి థ్రిల్లర్ బ్యూటీతో మాస్ రాజా స్పెషల్ ఐటెమ్ సాంగ్
కొంతమంది హీరోయిన్స్ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో వారి క్రేజ్ ని మరింత పెంచుకుంటున్నారు. సాంగ్ క్లిక్కయితే డబ్బుతో పాటు సినిమా ఛాన్సలు కూడా చాలా స్పీడ్ గా వస్తాయనే చెప్పాలి. ఇక లాక్ డౌన్ లో ఆర్జీవి ఎక్కువగా హైలెట్ చేసిన అప్సర రాణి కూడా ఒక ఐటెమ్ సాంగ్ లో సర్ ప్రైజ్ ఇవ్వనుంది. ఈ బ్యూటీ ఆ మధ్య సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ బ్యూటీతో థ్రిల్లర్, డేంజరస్ అంటూ సినిమాలు తెరకెక్కించిన వర్మ టీజర్ పోస్టర్లతోనే మంచి హైప్ క్రియేట్ చేశారు.
ఇక చాలా రోజుల తరువాత ఈ బ్యూటీ ఒక మంచి ఆఫర్ అందుకుంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయ్యింది. ఇప్పుడు ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్ ని కూడా రెడీ చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా సిద్ధమవుతున్న ఆ సాంగ్ లో రవితేజతో అప్సరరాణి ఘాటైన మాస్ స్టెప్పులతో సరికొత్త సర్ ప్రైజ్ ఇవ్వనుందట. సాంగ్ చిత్రీకరణలో చిత్ర యూనిట్ దిగిన సెల్ఫీ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి ఈ సినిమాలోని పాటతో అప్సర రాణి కెరీర్ కి ఎలాంటి బూస్ట్ లభిస్తుందో చూడాలి. ఇక గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమాలో మాస్ రాజా రవితేజ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. డాన్ శీను, బలుపు వంటి హిట్స్ తరువాత డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఎలాగైనా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత పరిస్థితులను బట్టి సినిమాను తగిన సమయంలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











