"పుష్ప 2" కొత్త కాంట్రవర్సీ .. సీరియస్ అయ్యే లోపే తగ్గిన పుష్ప రాజ్..
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం ఇండియా వైడ్‌గా వైరల్‌గా వినిపిస్తున్న సినిమా పేరు "పుష్ప 2 ది రూల్" అనే చెప్పాలి. ఈ సినిమా గురించి మాత్రమే కాకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యిన నాటి నుంచి ఇంకా చెప్పాలంటే రిలీజ్‌కి ముందు నుంచి కూడా ఏదొక సందర్భంలో కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంది.
సినిమా భాషల రిలీజ్ కి సంబంధించి అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విషయంలో కానీ ఇక వీటి అన్నింటి కంటే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యిన రోజు కంటే ముందు నుంచే ఊహించని విధంగా కాంట్రవర్సీ అయితే రేపుతూ వచ్చింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లిన రోజు నుంచి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోనే ఒక మినీ యుద్ధం చేస్తున్నారు.

కాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో డైరెక్ట్ గా మాట్లాడడంతో ఊహించని విధంగా వివాదం పెద్దది అవుతూ వచ్చేసింది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇలా ఒక రేంజ్ లో రచ్చలా నడుస్తున్న సందర్భంలో పుష్ప 2 మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ చిత్రంపై ఉన్న కంప్లైంట్స్ లో పోలీసులని అవమానిస్తూ ఉన్న సీన్స్ పట్ల కూడా చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్, పోలీస్ స్టేషన్ అంటూ తిరుగుతున్నారు. మరి ఇలాంటి సమయంలో గవర్నమెంట్ ని అలాగే పోలీసులని ట్రిగ్గర్ చేసే విధంగా వచ్చిన ఓ సాంగ్ ఒక్కసారిగా షాకిచ్చింది. పుష్ప 2 లో అల్లు అర్జున్ పాడిన సాంగ్ దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు అనే సాంగ్ కోసం అందరికీ తెలిసిందే. ఇది సరిగ్గా అల్లు అర్జున్ తెలంగాణ పోలీసుల దగ్గర విచారణలో ఉన్న సమయం లోనే బయటకి రావడంతో అందరిలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి మేకర్స్ ఈ సినిమా నుంచి ఒకో సాంగ్ గత కొన్ని రోజులు నుంచి రిలీజ్ చేస్తున్నారు. అలాగే వాటిలో మంచి డిమాండ్ ఉన్న ఈ సాంగ్ ని మాత్రం రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేశారు. దీనితో తెలుగు ప్రేక్షకులు అసలు మేకర్స్ ఏమనుకొని రిలీజ్ చేశారు ఇప్పటికీ ఉన్న ఇబ్బందులు చాలవా అనుకున్నారు.
కానీ ఆ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు ఆహా ఓహో అంటూ ఎలివేషన్స్ అనుకున్నారు . కానీ మేకర్స్ దీనిని కొంచెం ముందే పసిగట్టి అది పెద్దది అయ్యేలోపే యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేసారు. దీనితో సినిమాల్లో తగ్గని పుష్పరాజ్ మాత్రం ఇపుడు బయట తగ్గి తీరాల్సి వచ్చింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా మైత్రి మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.


Click it and Unblock the Notifications











