మార్కెట్‌లోకి కొత్త నేషనల్ క్రష్ .. రష్మిక తర్వాత ఇప్పుడీ హాట్ బ్యూటీయే

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. ఈ కొందరిలో కూడా ఒక్కో హీరోయిన్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉందని చెప్పొచ్చు. ఇలా కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లలోనే కొందరు మంచి ఫేమ్‌ని తెచ్చుకుంటే ఇంకొందరు కొంత సమయం తీసుకొని గుర్తింపుని అందుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఉన్న ట్రెండ్‌లో కొందరు హీరోయిన్స్‌లో నేషనల్ క్రష్ అంటూ పేర్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి.

వీరిలో ఈ మాట మాత్రం మొదలైంది సౌత్ టాప్ బ్యూటీ రష్మిక మందన్నా నుంచే అని చెప్పాలి. వరుస హిట్స్‌తో యువతలో మంచి క్రేజ్‌ని అలాగే నేషనల్ వైడ్‌గా మంచి ఫేమ్‌ని అందుకున్నారు రష్మిక. స్టార్ హీరోయిన్ స్టేజ్ నుంచి ఏకంగా నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ కస్తూరి. కొన్నేళ్ల క్రితం గూగుల్లో నేషనల్ క్రష్ ఎవరు అని వెతికితే రష్మిక పేరే రావడం మొదలైంది.

a new national crush comes in india after rashmika tripti dimrii

తన తర్వాత నుంచి ఈ టాగ్‌కి మరింత మంది యంగ్ అండ్ హాట్ బ్యూటీల పేర్లు వినిపించాయి. రష్మిక తర్వాత కొత్త నేషనల్ క్రష్ అంటే అది యానిమల్ మూవీ హీరోయిన్ తృప్తి దిమ్రి అని చెప్పాలి. కాగా తృప్తి తొలుత హీరోయిన్‌గా కాకపోయినప్పటికీ అదే రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకుని దేశవ్యాప్తంగా భారీ ఫేమ్‌ని తెచ్చుకుంది.

అప్పటి వరకు పలు సినిమాల్లో చేసింది కానీ వాటిలో ఏ సినిమాకి కూడా రాని రెస్పాన్స్‌ని ఈ ఒక్క సినిమాకి అందుకొని ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయింది తృప్తి. దీనితో అక్కడి నుంచి ఆమె గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేయడమే కాదు.. కొత్త నేషనల్ క్రష్ అంటూ తృప్తిని పిలవడం మొదలు పెట్టారు . ఇక ఇపుడు ఈ ఇద్దరు నడుమ పోటీ అనుకుంటే మార్కెట్ లోకి కొత్త నేషనల్ క్రష్ వచ్చింది అంటూ ఓ టాక్ నడుస్తుంది.

ఈ హీరోయిన్ ఎవరో కాదు లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తున్న హాట్ బ్యూటీ వామికా గబ్బి అట. ఈమె ట్రాక్ రికార్డులో మరీ ఎక్కువ హిట్స్ లేవు. కానీ ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ టూ టాలీవుడ్ కుర్రాళ్లంతా ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు.

వీటితో పాటుగా రీసెంట్ హాట్ షోతో కూడా మంచి ట్రెండింగ్ లో నిలవడంతో పాటు హాట్ షో చేసిన కీర్తి సురేష్ ఉన్నప్పటికీ ఈమెపై అంతా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టారు. దీనితో వామికా గబ్బి చిత్ర పరిశ్రమలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలతో చాలా మంది మార్కెట్‌లోకి కొత్త నేషనల్ క్రష్ వచ్చింది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో వామిక మరింత ఫేమ్ సంపాదిస్తుందా లేదా అనేది.

More from Filmibeat

Read more about: wamiqa gabbi triptii dimri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X