కట్ చెప్పినా హీరోయిన్ పై ఆపని ముద్దుల వర్షం.. టాప్ హీరో నిర్వాకం
సినిమా అనేది నిజం అనిపించే అందమైన అబద్దం అని అందరికీ తెలిసిందే. తెరపై జరుగుతున్నది నాటకీయమే కావచ్చు కానీ అది మనకి నిజమే అన్నట్టు ఆడియెన్స్ కి అనిపించే ఫీల్ ఇవ్వడమే సినిమా తాలూకా గొప్పతనం. కాగా సినిమాలో అంతలా ఆడియెన్స్ లీనం అవ్వాలంటే అందులో హీరో అండ్ హీరోయిన్స్ నడుమ కెమిస్ట్రీ కూడా కీలకమే..
అయితే ఇలా చాలా మంది హీరో అండ్ హీరోయిన్స్ తెరపై అదరగొడతారు. అలాగే సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం అనేది ఒకింత కష్టం అని చాలా మంది హీరోయిన్స్ అంటారు. మరి ఈ హాట్ రొమాంటిక్ సీన్ కి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. బాలీవుడ్ సినిమాకి చెందిన ఓ టాప్ హీరో తన సినిమా షూటింగ్ లో షూటింగ్ అనే విషయాన్ని మర్చిపోయి హీరోయిన్ పై ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తున్న క్లిప్ ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

కాగా ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ హీరో వరుణ్ ధావన్. రీసెంట్ గా సౌత్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ తో కూడా గట్టి రొమాన్స్ నే చేసిన ఈ టాప్ స్టార్ పై ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. కాగా వరుణ్ ధావన్ నటించిన సినిమా "మే తేరా హీరో" అనే సినిమాలో హీరోయిన్ నర్గీస్ ఫక్రీతో ఓ హాట్ కిస్సింగ్ సీన్ ఉంటుంది. ఇందులో హీరోయిన్ మెడపై హీరోలు ముద్దులు పెట్టే సీన్ ఇది కాగా ఆ సీన్ తాలూకా షూటింగ్ వీడియో లీక్ అయ్యింది.
అయితే ఇందులో దర్శకుడు కట్ చెప్పినప్పటికీ వరుణ్ ధావన్ ఆమెకి ఆపకుండా ముద్దులు పెడుతూనే ఉంటాడు. అయితే హీరోయిన్ కట్ చెప్పక ముందు వరకు ఒక మూడ్ లో కనిపిస్తుంది కట్ చెప్పిన వెంటనే ఆపుతుంది కానీ వరుణ్ ధావన్ మాత్రం ఆ సీన్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. దీనితో ఈ షాకింగ్ క్లిప్ ఇపుడు వైరల్ గా మారింది. కాగా ఎపుడో 2014లో వచ్చిన ఈ సినిమాపై ఇపుడు ఈ క్లిప్ వైరల్ గా మారడం గమనార్హం.
అయితే ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ వరుణ్ ధావన్ పై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇంకొందరు అయితే బహుశా వరుణ్ ధావన్ తాను నటిస్తున్నాను అని మర్చిపోయి ఉంటాడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈ వీడియో క్లిప్ ఇపుడు వైరల్ గా మారింది.
ఇక వరుణ్ ధావన్ నటించిన లేటెస్ట్ చిత్రం "బేబీ జాన్" కాగా ఈ సినిమా తమిళ హిట్ చిత్రం 'తేరి' కి రీమేక్ గా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా తోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇది కాకుండా రీసెంట్ గానే సమంతతో సిటాడెల్ హనీ బన్నీ అనే సిరీస్ లో కూడా వరుణ్ ధావన్ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











