ప్రభాస్ పేరు మీద ఊరు.... అది ఎక్కడుందో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా పాన్ ఇండియా ఆడియెన్స్ ను అలరించేందుకు లైనప్ ఉన్న భారీ చిత్రాలను ఫినిష్ చేసుకుంటూ వస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజ్, మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలిసిందే. ఆయన రెమ్యునరేషనే రూ.100 కోట్లకు పైగా ఛార్జీ చేస్తుండటం విశేషం. డార్లింగ్ చిత్రాలకు రూ.500 కోట్లకు పైనే నిర్మాతలు బడ్జెట్ వెచ్చిస్తున్నారంటే ఆశామాషీ కాదు. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ చిత్రాలకు ఏ రేంజ్ డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా ఇలా ఉంటే.. డార్లింగ్ ప్రభాస్ ఎంతఎదిగినా అంత ఒదిగి ఉంటారనేది తెలిసిందే. రాజుల వంశంలో పుట్టిపెరిగిన డార్లింగ్ అదే స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా టాలీవుడ్ లోనే కాక.. బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఆయన హ్యుమానిటీకి ఫిదా అవ్వని వారుండరు. ఆరడుగుల ఆజానుబాహుడైన వెన్నలాంటి మనస్సుతో కోట్లాది మంది ప్రేమను పొందారు ప్రభాస్. ఇక డార్లింగ్ సేవా కార్యక్రమాలు కూడా ఏ స్థాయిలో చేస్తారో తెలిసిందే. కేరళలో వరదలు, కరోనా పరిస్థితులు, విజయవాడలో వరదలు, పలు విపత్తుకర పరిస్థితులలో డార్లింగ్ సాయం భారీగానే ఉంటుంది.

A Village Named as Prabhas Do You Know Where is it

అయితే.. ప్రభాస్ గురించి ఇంత వరకు ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేకపోవడం ఆయన అభిమానులకు సంతోషానిచ్చే విషయం. ఎంత ఎదిగినా ఇతర నటీనటులు, మరెవ్వరిపైనా ఒక్క మాటకూడా జారబోడు మన డార్లింగ్. అయితే.... డార్లింగ్ మంచితనమే కాబోలు ఆయన పేరు ఓ ఊరికి పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. అది మరెక్కడో లేదు మన దేశానికి పక్కనే ఉన్న నేపాల్ లో ఉంది. సమాజ సేవకులు, పొలిటిషన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పేరుమీద ఊర్ల పేర్లు ఉండటం సర్వసాధారణం. కానీ డార్లింగ్ పేరు మీద ఊరు ఉండటం ఆసక్తికరంగా మారింది.

కానీ డార్లింగ్ ప్రభాస్ కు ఆ ఊరుకు ఎలాంటి సంబంధం లేదు. నేపాల్ లో ఓ బ్లాగర్ రైడ్ కు వెళ్లిన సందర్భంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిన ప్రభాస్ పేరుతో విలేజ్ బోర్డ్ కనిపించడంతో ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్షణాల్లో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. డార్లింగ్ పేరును ఆ విలేజ్ కు పెట్టడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నేపాల్ లో ప్రభాస్ లాస్ట్ ఫిల్మ్ 'సలార్' ఓ రేంజ్ లో ఆడింది. అక్కడ ఆయనకు చాలా మంది డైహార్ట్ ఫ్యాన్స్ ఉండటం విశేషం.

ఇక ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. చివరిగా 'సలార్', 'కల్కి 2898 ఏడీ' మూవీస్ తో అలరించిన విషయం తెలిసిందే. ప్రేక్షకాదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రాలు విజయం సాధించాయి. కల్కి తో ఏకంగా రూ.1100 కోట్ల గ్రాస్ ను రాబట్టరు ప్రభాస్. ఇక నెక్ట్స్ 'రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్ 2, 'కల్కి2' చిత్రాలతో అలరించనున్నారు. రాజా సాబ్, ఫౌజీ షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతుండగా.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Read more about: prabhas spirit raja saab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X