పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసిన ‘పుష్ప’ టీమ్: AA Films India అంటూ అదిరిపోయే ప్రకటన
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ నుంచి అతి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. దీనికి కారణం మన సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తం కావడంతో పాటు టాలీవుడ్ హీరోల స్టామినా కూడా అంతకంతకూ పెరుగుతుండడమే. అందుకే ఈ మధ్య కాలంలోనే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు పట్టాలెక్కేశాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' ఒకటి. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా పలు అనుమానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే ప్రకటనను వదిలింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘పుష్ప'గా మారిపోయిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. యాంకర్ అనసూయ ఇందులో కీలక పాత్రను చేస్తోంది.

ఐకాన్ స్టార్ అనిపించుకోవాలని రిస్కు
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో 'పుష్ప' మూవీ రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఘాటీ రోడ్‌లో లారీ డ్రైవింగ్ నేర్చుకోవడం.. డీ గ్లామర్‌గా కనిపించడం.. చిత్తూరు యాసలో మాట్లాడడంతో పాటు రియల్ స్టంట్స్ ట్రై చేస్తున్నాడు.

రెండు భాగాలుగా విడుదల.. అప్‌డేట్
ఐదు భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇప్పటికే మొదటి భాగానికి 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్ కోసం దాదాపు 40 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు బ్యాలెన్స్ పార్ట్‌ను షూట్ చేస్తున్నారు.

విడుదలకు ముందే అన్నీ రికార్డులు
భారీ చిత్రం 'పుష్ఫ' నుంచి ఇటీవలే టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి ఇటీవలే 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి', 'సామీ సామీ', 'ఇది నా అడ్డా' పాటలను వదలగా ఇవి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

అక్కడ రిలీజ్ కావడం లేదని పుకార్లు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'పుష్ప' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అప్‌డేట్లను కూడా అన్ని భాషల్లోనూ ఇచ్చింది. అయితే, ఈ మధ్య ఇది హిందీలో విడుదల కావడం లేదంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో హాట్ టాపిక్ అయిపోయింది.

పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసిన ‘పుష్ప'
'పుష్ప' సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పాటను విడుదల చేయడం ద్వారా పరోక్షంగా వెల్లడించింది. అయినప్పటికీ దీనిపై పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రాన్ని AA Films India సంస్థ హిందీలో విడుదల చేస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే, స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ కన్నడంలో విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపింది.


Click it and Unblock the Notifications











